అనంతపురం ఎడ్యుకేషన్ : నవ్యాంధ్ర పీఈటీ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఉపాధ్యాయ భవనంలో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎం. రమేష్‌రెడ్డి, అధ్యక్షుడిగా బి.ప్రసాద్, ప్రధానకార్యదర్శిగా కె. రాజశేఖర్, ఆర్థికకార్యదర్శిగా ఎం. ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా రిజ్వానా, గోవిందప్ప, సంయుక్తకార్యదర్శులుగా ఆర్. లస్కర్‌నాయక్, కళా సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి. మల్లోబన్న, కృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు. ముఖ సలహాదారులుగా ఎం. శేషాద్రి, బి. చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం. రవీంద్ర, హరుణ్‌బాషాతో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.