సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు.
వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు.
♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్‌పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.
♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment