ఏడు ప్రధాన డిమాండ్లతో ఆందోళన.. సోమవారం నుంచి విధుల బహిష్కరణ
అత్యవసర, ఐసీయూ సేవలు మాత్రం కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: జూనియర్ డాక్లర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24 నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఏడు ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌జీ సాయిశ్రీహర్ష, ఐజక్ న్యూటన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శనివారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో భోజ న విరామ సమయంలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. 24 నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది.
సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఔట్ పేషెంట్, వార్డు సర్వీసులు, ఎలక్టివ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి. కార్యక్రమంలో టీ–జూడా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీశ్‌లతోపాటు పీజీలు, హౌస్‌సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ డిమాండ్లు
» ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా స్టైపెండ్ నిధులు విడుదల చేయాలి
» సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.1.25 లక్షలు గౌరవ వేతనం చెల్లించాలి
» ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి ళీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం కోటా తొలగించాలి ళీ నూతన మెడికల్ కాలేజీల్లో వసతిగృహాలు, రవాణా, పరిశోధనశాల సదుపాయాలు కల్పించాలి
» బోధనాస్పత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ ఔట్‌పోస్టు బలోపేతం చేయాలి
» సెక్యూరి టీ ఔట్‌పోస్టు లేనిచోట కొత్తగా ఏర్పాటు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment