సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. నేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్ చెస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు జూడాలు డీఎంఈతో చర్చలు కొనసాగించారు.
అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మెను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఇక జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్ అయి వెంటనే విధుల్లో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీలు లిఖితపూర్వకంగా ఇస్తేనే తాము విధుల్లో చేరుతామని జూడాలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారీ డీఎంఈతో జూడాల చర్చలు జరగనున్నాయి.
చదవండి: జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment