నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన | Hyderabad: Junior Doctors Strike In Niloufer Hospital | Sakshi
Sakshi News home page

నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

Nov 1 2021 4:09 PM | Updated on Nov 1 2021 4:15 PM

Hyderabad: Junior Doctors Strike In Niloufer Hospital  - Sakshi

(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదు.. వార్డుల్లో పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల వార్డుబాయ్‌  100 రూపాయల కోసం ఆక్సిజన్‌ను మార్చడం వలన ఒక పసివాడి నిండు ప్రాణం పోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటనకు నిరసనగా బాధితుల బంధువులు మూకుమ్మడిగా ఆస్పత్రి లోపలికి వచ్చారు. దీంతో.. ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధిత బంధువులు.. ఎక్కడ దాడిచేస్తారోనని భయపడిపోయారు. తక్షణం.. తమకు సరైన భద్రత కల్పించాలని ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టారు.  

చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement