
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
కాగా, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న టి–జూడా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది.
చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు
Etela Rajender: బీజేపీ వైపు ఈటల?
Comments
Please login to add a commentAdd a comment