నేడు హైదరాబాద్‌లో చర్చలకు రావాలి: టి.రాజయ్య
హన్మకొండ: జూనియర్ డాక్టర్లు మానవతాదృక్పథంతో సమ్మె విరమించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య సూచించారు. హన్మకొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని, ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించాల్సి ఉందన్నారు. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జూనియర్ డాక్టర్లు చర్చలకు రావాలని కోరారు. వారి ఐదు డిమాండ్లలో నాలుగింటిని పరిష్కరించేందుకు ఒప్పుకున్నామని చెప్పారు. సివిల్ సర్జన్లతో సమానంగా ప్రతినెలా వేతనాలు ఇవ్వడానికి అంగీకరించామన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేశామన్నారు. రూ. 7 కోట్ల నుంచి రూ.8 కోట్లు ఖర్చు భరించి రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఈ ఫోర్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఖాళీలను నేరుగా భర్తీ చేయనున్నామన్నారు.
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించాలి
Published Sun, Oct 19 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement