మమతల రాజధాని నిర్మించాలి
రాజధాని నిర్మాణ సందర్భంగా నేడు రాష్ట్రంలో చాలా ఆందోళనకర పరిణామాలు గమనిస్తున్నాం. విభజన తరువాత ఏర్పడ్డ సంక్షోభ నివారణకు నవ్యాంధ్రలో తగిన సవరణ లతో సమతుల్యతతో కూడిన అభివృద్ధికి గ్రేటర్ రాయల సీమ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పునాదులు వేసుకోవడానికి మారుగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో రాజధాని పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిం చడం, మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడంతో గ్రేటర్ రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాజధాని ప్రాంతాల్లో తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం చేపట్టిన పట్టిసీమ ఎత్తి పోతల పథకం రాయలసీమ వాసుల తాగునీటి కోసం, సాగునీటి కోసమని బుకాయిస్తూ చేస్తున్న ప్రకటనలు మరింతగా సీమవాసుల మనోభావాలను గాయపరుస్తున్నాయి.
రాజధాని అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకొనే ప్రాంతం. నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంతో మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో లక్ష ఎకరాల్లో అభివృద్ధిని కేంద్రీకరిస్తూ ఇతర ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కల్పించడమే.. రాజధాని ఎందుకు నిర్మిస్తున్నారు? టూరిజం, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు, ఎయిమ్స్ తదితర నిర్మాణాలను రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకరించడం ఎందుకు?
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవీ కూడా రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు రుచించడం లేదు. జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నిర్లక్ష్యానికి గురికావడం, కేంద్రం ఇచ్చిన నిధులు పట్టిసీమ పేరుతో అవినీతికి గురికావడం, రాజమండ్రి పుష్కరాలలో జరిగిన అవినీతిపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం లాంటి ఘటనలపై ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని బీజేపీ నేతలు పురంధరేశ్వరి, సోము వీర్రాజు చేస్తున్న డిమాండ్లను చంద్రబాబు లెక్కించడం లేదు. అత్యంత వివాదాస్పదమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సందర్భంలో నరేం ద్రమోదీ ఆంధ్ర పరిణామాలపై నిర్మాణాత్మకంగా స్పం దించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై మోదీ తెలుగు ప్రజలకు నిజంగా దసరా శుభాకాంక్షలు చెబు తారా? అనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబు దాదాపు 15 లక్షల ఎకరాల రైతుల భూముల్ని ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకొని వ్యాపారం చేయాలనుకుంటున్నారు. రాజధాని నిర్మాణాలు ఆపా లని గ్రీన్ టిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా చంద్ర బాబు ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ‘వ్యవసా యం దండగ’ అన్న ముఖ్యమంత్రి నేడు రైతుల భూము లతో వ్యాపారం చేస్తున్నారు. ఇంత దుస్సాహసానికి మరే రాజకీయ నాయకుడు పూనుకోలేదు.
ల్యాండ్ బ్యాంకు కింద ప్రభుత్వం, ఏపీఐఐసీ ఇప్పటి వరకూ సేకరించిన భూముల వివరాలు: శ్రీకాకుళం 4,493.37, విజయనగరం 16,913.39, విశాఖపట్నం 63,332.99, తూర్పు గోదావరి 64,228.24, పశ్చిమగోదావరి 1,388.15, కృష్ణా జిల్లా 15,384.74, గుంటూరు 48, 534.73, ప్రకాశం 43,996.11, నెల్లూరు 62,112.86, కడప 1,06,829.04, చిత్తూరు 1,60,938.58, కర్నూలు 45,166.18, అనంతపురం 1,30,842.17, మొత్తం 7,64,260.52 ఎకరాలు.
రాజధాని ప్రాంతంలో బాబు సేకరిస్తున్న లక్ష ఎకరాలు దీనికి అదనం. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నిరుపేదలకు దాదాపు ఐదు లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. అది కాక ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాలలో గిరిజనులు, పేదలు సాగు చేసుకుంటున్న ఏడు లక్షల ఎకరాలకు కేంద్ర ప్రభుత్వంతో అటవీశాఖ అనుమతులు సాధించి పంపిణీ చేయించారు. ఆ భూములను చదును చేసుకో వడానికి ఇందిరప్రభ పథకం పేరుతో వందల కోట్లు కేటాయించారు. చంద్రబాబు భూములు లాక్కోవడం, వైఎస్ భూములు పంచడం ఈ సందర్భంగా గమనించాలి.
నేడు రాజధాని నిర్మాణం కోసం వందల కోట్లు వెచ్చించి సంబరాలు జరుపుకుంటున్న ఘటన ఇతర ప్రాంతాల ప్రజలకు ఏ రకమైన ఉత్సాహం కలిగించ లేదనేది చంద్రబాబు గుర్తించాలి. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరుగుతున్న పరిణామాలను నిర్మాణాత్మకమైన సూచనల ద్వారా ఎప్పటికప్పుడు అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయటా తగు విధంగా సూచిస్తూ వచ్చారు. ఆయన ఆందోళనలు కూడా చేప ట్టారు. వాటినేమీ బాబు పట్టించుకున్నట్లు లేదు. చివరకు పట్టిసీమలో అవినీతి, రాయలసీమ సేద్యపునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం గురించి రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాలు కేటాయించాలని కోరుతున్న మిత్రపక్షం బీజేపీని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు.
వామ పక్షాలు, లోక్‌సత్తా లాంటి పార్టీలు అనేక ప్రజాసం ఘాలు, రైతు సంఘాలు వెలిబుచ్చుతున్న అభిప్రాయా లను ఆయన పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరుగుతున్న ఈ పరిణామా లలో తమకు భవిష్యత్తులో, చరిత్రలో దోషులుగా చేర్చే పరిస్థితులనుండి వేరుకావడం కోసం రాజధాని శంకు స్థాపన కార్యక్రమాలను బహిష్కరించారు. మరో చారి త్రక తప్పిదంలో తాము భాగస్వాములు కావడానికి తిర స్కరించడం ద్వారా ప్రతిపక్ష నేత తీసుకున్న నిర్ణయం ఒక హెచ్చరికలాగ తీసుకొని చంద్రబాబు ఏ మేరకు తన తప్పిదాలు సవరించుకుంటారో ఆ మేరకు ఆయనకు, రాష్ట్రానికి ఫలితాలుంటాయి.
-ఇమామ్
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్: 99899 04389