చిరస్మరణీయుడు శివరామకృష్ణన్
నవ్యాంధ్రప్రదేశ్‌లో అభి వృద్ధి వికేంద్రీకరణ, వెను కబడిన ప్రాంతాల అభి వృద్ధి, ప్రత్యేకించి నూతన రాజధాని తదితర అంశా లపై చాలా శాస్త్రీయమైన పద్ధతిలో ప్రాంతీయ రాగ ద్వేషాలకు అతీతంగా నివే దిక సమర్పించినవారు శివరామకృష్ణన్. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని ప్రజల సర్వతోముఖాభివృద్ధిపై ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ సమర్పించిన నివేది కను ప్రతి తెలుగువాడు అధ్యయనం చేయాలి. గతం లో కృష్ణా జలాల పంపిణీ సందర్భంగా పరీవాహక రాష్ట్రాల మధ్య తగాదాలు తీర్చడానికి ఏర్పాటైన బచావత్ కమిషన్, అలాగే గోదావరీ జలాల విని యోగంపై ఏర్పాటు చేసిన గుల్హాతి కమిషన్, ఇటీ వల రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ నివేదికలు చాలా విలువైనవి. తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలపై ఎంతో బాధ్య తతో అధ్యయనం జరిపి ఇచ్చిన నివేదికలవి. ఆ నివే దికల ఆధారంగా మన తెలుగు పాలకులు బాధ్య తగా స్పందించి ఉంటే నేడు ఏర్పడబో తున్న సంక్షోభాలను పరిష్కరించి ఉండ వచ్చు.
కేంద్రంలో నాటి సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఆంధ్రప్ర దేశ్ విభజనానంతర పరిస్థితులను, ఏర్పడబోయే పరిణామాలను సక్రమం గా అంచనా వేయకుండా చేసిన విభజన తో జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. విభ జన జరిగిన తీరు కూడా భారత పార్లమెంట్ చరి త్రలో చీకటి రోజుగా నిలిచిపోయింది. శ్రీకృష్ణ కమి షన్ నివేదికలను ఆనాటి పాలకులు చెత్తబుట్టలోకి నెట్టివేస్తే, శివరామకృష్ణన్ నివేదికను నేడు చంద్ర బాబు ప్రభుత్వం కనీస చర్చను కూడా చేపట్టకుండా అసెంబ్లీలో ఏకపక్షంగా రాజధాని నిర్మాణ ప్రాంతా లను ఎంపిక చేసింది. కనీసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. రాజధాని నిర్మాణ ఎంపిక పరిణామా లపై చర్చించనూ లేదు.
రాష్ట్రంలో చాలా విలువైన పంట భూములను రైతన్నల నుంచి సేకరించ డం సరైంది కాదని ప్రభుత్వం భూము లు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్నా యని, తరచుగా వరదలు తుఫానులకు గురయ్యే ప్రాంతాల ఎంపిక సరికాదని, పైగా ఆ ప్రాంతాలకు భూకంప ప్రభా విత చరిత్ర కలదని శివరామకృష్ణన్ హెచ్చరిక చేశారు. అంతటి విలువైన నివేదికను నిర్లక్ష్యం చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశా రు. ఆయన ప్రధాని నరేంద్రమోదీ నుంచి కనీస రాజకీయ విజ్ఞత నేర్చుకోవాలి. దేశంలో నేడు ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోదీ ఆహ్వానించి మరీ చర్చలు జరిపారు. కనీస రాజకీయ విజ్ఞత ఉంటే రాజధాని ప్రాంతాల సమ స్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చర్చలకు ఆహ్వానించాలి. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమస్యలు, ప్రత్యేకించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల అభివృద్ధి సమస్యలపై ప్రతిపక్ష నేత అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోవాలి.
చంద్రబాబు విపరీతమైన అభివృద్ధిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తుండటం వల్ల శివరామకృష్ణన్ హెచ్చరికలు చేసినట్లు భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తే ప్రమాదముంది. దీనికి భిన్నంగా శివరామకృష్ణన్ నివేదిక అమలుపరిస్తే విభజన ఉద్య మాలు పుట్టుకొచ్చేవని చంద్రబాబు ప్రకటించడం వింతగొల్పుతుంది. ఎంతో బాధ్యతతో కూడిన కమి షన్ నివేదికపై బురదజల్లాలని, తిమ్మినిబమ్మిని చేయాలని చంద్రబాబు ప్రయత్నించటం పెద్దలు శివరామకృష్ణన్‌గారిని కించపర్చడానికి చేసిన ప్రయ త్నమే. ఎంతో విజ్ఞులు, వివేకవంతులైన శివరామ కృష్ణన్ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా తమ నివేదికను తెలుగు ప్రజల ముందు ఉంచారు. ఇవ్వాళ ఆయన భౌతికంగా మన ముందు లేకపో వచ్చు. కాని తన నిష్పాక్షిక నివేదికతోపాటు ఆయన కూడా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, అమరజీవిగా నిలిచిపోతారు.
(శివరామకృష్ణన్ మృతికి నివాళి) వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు
ఇమామ్