సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు.
‘‘రాష్ట్రానికి నష్టం జరిగే విధానాన్ని మేం ఒప్పుకోం. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తాం. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటాం. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోం. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే అసత్య కథనాలకు మేం భయపడం. సీఎం జగన్‌పై బురదచల్లడమే లక్ష్యంగా రామోజీ, రాధాకృష్ణ పనిచేస్తున్నారు’’ అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు.
చదవండి: కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించండి
Comments
Please login to add a commentAdd a comment