గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు పాలనలో సేద్యపు నీటి ప్రాజెక్టుల నిండా అవినీతి అక్రమాలు అంచనాల పెంపు పేరుతో వేల కోట్ల దోపిడీకి తెర లేపారు. నేడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి దశలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు ఎడమగట్టు కాలువ రీ టెండరింగ్‌లో వందల కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖాతాలోకి చేరేలా ప్రాజెక్టు పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. దీనిపై సహజంగానే అవినీతి అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పార్లమెంట్ ఆమోదం పొంది న తర్వాత రెండేళ్లు నిర్మాణం చేపట్టకుండా విపరీ తమైన నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ తప్పుబట్టిన విషయాన్ని ఇక్కడ గుర్తిం చుకోవాలి.
ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథా రిటీ పరిధిలో నుండి రాష్ట్ర పరిధిలోకి బదలా యించుకోవడంలో తనదైన అవినీతి అక్రమాలు చేపట్టి చివరి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ప్రాజెక్టు అంచనాకు సంబంధించి పునరావాస ప్యాకేజీ అంచనా రూ.16,010.45 కోట్ల నుండి రూ.58,319.06 కోట్లకు పెంచుకున్నారు. దాదాపు ఇదే ప్రహసనాన్ని 24 ప్రాజెక్టులలో తొలి అంచనాల్ని రూ.37,952.92 కోట్ల నుండి రూ.95,060.78 కోట్లకు పెంచుకున్నారు. పెంపు అంచనాల వ్యయాన్ని ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవీఆర్ కృష్ణారావు, అజయ్ కల్లామ్, ఎస్పీ సత్య ప్రకాష్ టక్కర్, దినేష్ అంగీక రించలేదు. చంద్రబాబు క్యాబినెట్ తీర్మానాలతో ఈ అంచనాల పెంపును అంగీకరింపచేసు కున్నారు. ఈ విషయాలను కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. నేడు జగన్‌మోహన్‌రెడ్డి, రీ టెండరింగ్ విధానాన్ని విన్నూత పద్ధతిలో ఏ రాష్ట్ర ప్రభ్వుతం చేపట్టని రీతిలో చేపట్టి ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడానికి నడుం బిగించారు. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టుతో పాటు అనేక సేద్యపు నీటి ప్రాజెక్టుల్లో వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో సేద్యపు నీటి ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలు చేపట్టకుండా, తప్పులు చేసి నిర్లక్ష్యంగా ప్రాజెక్టులలో నేరస్తులుగా నిరూ పించ బడిన వారికి దేశం గుర్తించుకునే విధంగా చర్యలు తీసుకొని ఒక నూతన ఒరవడిని ఆంధ్రప్రదేశ్ చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వాలు చట్టం, న్యాయం ఆధారంగా ఇటువంటి నేరస్తులపై చర్యలు తీసుకొని నూతన ఒరవడిని సృష్టించాలి.
గోదావరి జలాలలో ఉమ్మడి రాష్ట్రానికి గుల్‌హాతి కమిషన్ కేటాయించిన 1,496 టీఎంసీల నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యన పంపిణీ చేసుకోవడానికి తద్వారా కృష్ణా నదిలోకి నీటిని తరలించుకోవడానికి చంద్రబాబు ఏ రోజూ ప్రయ త్నించలేదు. కానీ నేడు జగన్, కేసీఆర్ సాహ సోపేతంగా గోదావరిలో దిగువన ఈ రాష్ట్రాలకు కేటాయించిన జలాలనే కాకుండా సముద్రం పాలవుతున్న నీటిని, కృష్ణా నదిలోని నీటిని తెలంగాణ, రాయలసీమ, ఖమ్మం, మహ బూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు పంపిణీ చేయడమే కాకుండా.. రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించుకోవడానికి కూడా జరుపుతున్న చర్చలు జయప్రదం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తన ఎల్లో మీడియా దన్నుతో ఇరు రాష్ట్రాల మధ్య అనుమానాలు, అపోహలు, సందేహాలు కల్పించే వాతావరణాన్ని సృష్టించి తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి విద్రోహం తలబెట్టే దుర్మార్గమైన ఆలోచనలకు పునాదులు వేస్తున్నారు. గతంలో ఏ ప్రాజెక్టులోనూ లేదా ఏ ప్రభుత్వ పథకంలోనూ చంద్రబాబు అవినీతి లేకుండా కార్యా చరణ చేపట్టింది లేదు. చివరికి హైకోర్టు.. విద్యుత్ ఒప్పందాలలో రూ. 2,500 కోట్లు ఆదా చేస్తూ. చంద్రబాబు చేసుకున్న అక్రమ ఒప్పందాలను రద్దు చేస్తూ తక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలపరిచింది. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా ఎగువన శ్రీశైలం నుండి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా లభించే నీటితో శరవేగంగా అవినీతి రహిత ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని జగన్ ప్రభుత్వం విజయవంతంగా ప్రజల మద్దతుతో పురోగమించాలని ఆశిద్దాం.
ఇమామ్
వ్యాసకర్త కదలిక ఎడిటర్
మొబైల్ః 9989904389
Comments
Please login to add a commentAdd a comment