ఇమామ్
సందర్భం
సాగునీటి రంగంలో సం క్షోభాన్ని పరిష్కరించడా నికి మారుగా చంద్రబాబు ప్రాంతాలు, జిల్లాల మధ్య వివాదాలు రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీ ర్యం చేస్తూ... గోదావరి, కృష్ణా జిల్లాల రైతాంగం భవిష్యత్‌నూ ప్రశ్నార్థకం చేసే దిశగా ఆయన తన రాజకీయ గమనం కొనసాగించారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన హంద్రీ-నీవా కాలువకు ఇరువైపుల సేద్యపు నీటి వసతులు కల్పిం చే కాలువల పనులను ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. నేడు హంద్రీ- నీవాను కుదించి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, కుప్పం తదితర ప్రాంతాలకు నీటిని తీసుకుని వెళ్లాలని బాబు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలు అనంతపురం జిల్లా వాసులను కలవరపెడు తున్నాయి. అనంతపురం ప్రజలు ఏ రోజూ చిత్తూరు జిల్లా తాగు, సాగునీటి అవసరాలకు వ్యతిరేకం కాదు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో కేటాయించిన జలా లతో ఈ ప్రాంత అవసరాలను తీర్చి చిత్తూరు, కడప జిల్లాల అవసరాలకు కృష్ణా జలాలను తరలించాలని మాత్రమే ఈ జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
ఒక ఏడాదిలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి తరలించడం జరు గుతుందని, ఆ మేరకు అదే సామర్థ్యపునీటిని ఎగువ శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలు తీర్చడానికి జరుగుతున్న కృషిని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని బాబు ఆరోపణలు చేశారు. పట్టి సీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాలోకి తరలిం చడం జరిగినప్పుడు ఎగువన శ్రీశైలం నుంచి ఆ మేరకు నీటిని హంద్రీ-నీవాకు, గాలేరు-నగరికి శ్రీశై లం కుడికాలువ ద్వారా మరియు కేసీ కెనాల్‌కు నీటిని కేటాయించి రాయలసీమ అవసరాలు తీర్చ గలిగే అవకాశమున్నప్పుడు హంద్రీ-నీవాను కుదిం చాల్సిన అవసరమేమిటి? పట్టిసీమను జగన్ మోహ న్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారని విషప్రచారం చేసిన బాబు తానెందుకు పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తు న్నారు? ఒక ప్రాజెక్టుకు మార్పులు, చేర్పులు జరిపే టప్పుడు రైతు సంఘాలతో, ప్రతిపక్ష నాయకులతో, కేబినెట్ మంత్రులతో చర్చలు జరిపే సంప్రదాయా లు ఎందుకు వదులుకుంటున్నారు?
1972 కేంద్ర ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన నిరంతర కరువు పీడిత ప్రాంతాలు కేవలం వర్షాధా రిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వ్యవసాయం అటకెక్కింది. రైతులు దివాళా తీశారు. లక్షల సంఖ్యలో అనంతపు రం, చిత్తూరు, కడప, కర్నూలు, మెట్ట ప్రాంతాల లోని వ్యవసాయ కూలీలు, రైతులు, మహిళలు పొట్ట చేత పట్టుకుని కూలి పనుల కోసం నగరాలకు వలస బాట పట్టారు. వేల గ్రామాలలో తాగునీటి ఎద్దడి తీవ్రత మనం ఎదుర్కొంటున్నాం. అనంతపురం జిల్లాలో 2 లక్షల బోరు బావులు భూగర్భ జలాలను లాగివేశాయి. అలాగే కడప జిల్లాలోని రాయచోటి తదితర ప్రాంతాలలో తాగు నీరే దొరకని పరిస్థితి. ఇంత సంక్షోభం ఉన్న ప్రాంతాల అవసరాలు తీర్చ డానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కోట్లు వెచ్చిం చి ఎవరూ సాహచించని ఎత్తిపోతల పథకం, హంద్రీ నీవా గురించి చేసిన ఆలోచన ఎంత గొప్పది. ఆ ప్రాజెక్టు పట్ల నిరంతరం విషం కక్కుతూ... వైఎస్‌పై, జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిం చిన బాబు చేస్తున్నది ఏమిటి? నిజంగా చంద్రబా బులో ఏ మాత్రం ప్రజాస్వామిక విలువలు ఉన్నా సేద్య పు నీటి ప్రాజెక్టులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయడానికి సాహసించగలరా? సీమవాసుల, ప్రత్యే కించి అనంతపురం జిల్లావాసుల అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయగలరా?
(వ్యాసకర్త కదలిక సంపాదకులు)
మొబైల్: 99899 04389