handri-niva Project
-
కుప్పంకు కృష్ణమ్మ వచ్చేనా?
-
హంద్రీ-నీవాతోనే జిల్లా సస్యశ్యామలం
► డిస్ట్రిబ్యూటరీలను వెంటనే నిర్మించాలి ► ఆయకట్టుకు నీటి సాధన కోసం ఐక్య పోరాటం ► రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు అనంతపురం రూరల్ : హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తేనే జిల్లా సస్యశ్యామలం అవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని దుయ్యబట్టారు. సోమవారం అనంతపురంలోని ఎన్జీవో హోంలో హంద్రీ-నీవా డిస్ట్రిబ్యూటరీ పనులను ప్రారంభించి జిల్లాలోని 3 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న డిమాండ్‌తో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ హంద్రీ-నీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి.. రూ.6,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో హంద్రీ-నీవాకు రూ.558 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని చూస్తే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీనిద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీరు అందించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించినప్పటికీ హంద్రీ-నీవాను పూర్తి చేసి అనంతపురం జిల్లాకు నీరందిస్తామంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే పట్టిసీమను పక్కన పెట్టి హంద్రీనీవాను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పట్టిసీమ వైపు మొగ్గు చూపారని విమర్శించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరా ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం జిల్లాకు చేస్తున్న అన్యాయంపై ప్రజలను చైతన్యపరచి ఐక్యఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా పనులకు రీ టెండర్లు పిలిచి ఐదు రెట్లు ఎక్సెస్‌కు టీడీపీ అనుయాయులకు కేటాయించారని విమర్శించారు. జిల్లాలో 87వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 33వప్యాకేజీ కింద భూసేకరణ చేపట్టిన టెండర్లను సైతం రద్దు చేశారన్నారు. కుప్పంకు నీరు తీసుకుపోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన కాలువ పనులను మాత్రమే వేగవంతం చేయిస్తున్నారని విమర్శించారు. సీపీఐ సీనియర్ నేత రమణ మాట్లాడుతూ జిల్లా నాయకులు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీలకు అతీతంగా ఆయకట్టుకు నీటి సాధన కోసం ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతు ఆత్మహత్యలను నివారించడం కోసం ప్రతి ఎకరాకు సాగు నీరు తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుడు కేవీ రమణ, అఖిల పక్ష నాయకులు జాఫర్, రంగారెడ్డి, కదలిక ఇమామ్, పెద్దన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, శరత్‌చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి
అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: హంద్రీ-నీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న ఆత్మకూరు మండలం పంపనూరు తండా నుంచి గొరిదిండ్ల వరకు పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో జాప్యం ఉండకూడదని, ప్రతి రోజు ప్రగతి చూపించాలని అధికారులను ఆదేశించారు. . భూసేకరణ, ఇత రాత్ర ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. -
జూన్ నాటీకి హంద్రీ-నీవా నీళ్లు
తిరుపతిని సుందరనగరంగా తీర్చిదిద్ది రుణం తీర్చుకుంటా శ్రీసిటీ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు తిరుపతి పరిసరాల్లో చెరువుల ఆధునికీకరణ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి జన్మభూమి సభలో సీఎం చంద్రబాబునాయుడు చిత్తూరు: హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తిచేసి జూన్ నాటికి చిత్తూరు, కుప్పం ప్రాంతాలకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రపంచస్థాయి వసతులతో తిరుపతి నగరాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గురువారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. తిరుమల ప్రపంచ ఆథ్యాత్మిక కేంద్రం కావడం వల్ల తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకాభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, ఏర్పేడు ప్రాంతాల్లోని వంద చెరువులను ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామన్నారు. పార్కులు సైతం నెలకొల్పుతామన్నారు. సోమశిల-స్వర్ణముఖిని పూర్తిచేసి బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. శ్రీసిటీ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. తిరుపతిని హార్డ్‌వేర్ హబ్‌ను నెలకొల్పుతున్నామన్నారు. తెలుగు గంగ నీటిని తిరుపతికి తరలించింది తానేనన్నారు. బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు జపాన్‌కు చెందిన జయ్కా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. విశాఖ-చెన్నై కారిడార్ కింద టౌన్‌షిప్‌ను ఏడీబీ ముందుకు వచ్చిందన్నారు. తిరుపతిని విజ్ఞాన కేంద్రం కూడా తీర్చిదిద్దుతామని బాబు చెప్పారు. ఇప్పటికే హైజర్, ఐఐటీలు వచ్చాయన్నారు. వావిలాల చెరువును అభివృద్ధి చేసి హైదరాబాద్ లోని బ్రహ్మనందరెడ్డి పార్కు కంటే మిన్నగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతిలో ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతి నగరంలో ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రగిరి కోటను సైతం మరింత అభివృద్ధిచేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో నీరు- చెట్టు పనుల ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో అన్ని చెరువులు నీటితో నిండాయన్నారు. వర్షం వచ్చే నాటికి 33 మీటర్ల లోతున్న భూగర్భజలాలు ప్రస్తుతం 10.9 మీటర్లకు చేరాయన్నారు. దీనివల్ల 90 టీయంసీల నీళు పొదుపు చేసినట్లు అయ్యిందని, తద్వారా 9లక్షల ఎకరాలకు నీరందే అవకాశముందన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి పనులను పూర్తిచేసి జిల్లాలో కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, జేసీ-2 వెంకటసుబ్బారెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, తుడా కార్యదర్శి మాధవీ లత తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా రుణం తీర్చుకుంటా
♦ రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయం ♦ హంద్రీ-నీవా పూర్తికి కృషి ♦ ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు ♦ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా పయ్యావుల కేశవ్ అనంతపురం అర్బన్ : ‘అనంత ప్రజల మనిషిగా జిల్లా రుణం తీర్చుకుంటా. రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయం. రాయలసీమకు ప్రాణాధారమైన హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా’నని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ అన్నారు. తన ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్ ఫారాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీలో సైనికునిలా పనిచేసిన తనకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడు జిల్లా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి పట్టిసీమకు ఎంత ప్రాధాన్యతిస్తున్నారో.. హంద్రీ-నీవాకూ అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రతిక్షణం పాటుపడతానని పునరుద్ఘాటించారు. కార్యకర్తల సంబరాలు : ఎమ్మెల్సీగా కేశవ్ డిక్లరేషన్ అందుకున్న సందర్భంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. కేశవ్‌కు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి అభినందలు తెలిపారు. -
హంద్రీ-నీవా ప్రాజెక్టు సాధనకు చంద్రబాబు తిలోదకాలు
సందర్భం సాగునీటి రంగంలో సం క్షోభాన్ని పరిష్కరించడా నికి మారుగా చంద్రబాబు ప్రాంతాలు, జిల్లాల మధ్య వివాదాలు రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీ ర్యం చేస్తూ... గోదావరి, కృష్ణా జిల్లాల రైతాంగం భవిష్యత్‌నూ ప్రశ్నార్థకం చేసే దిశగా ఆయన తన రాజకీయ గమనం కొనసాగించారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన హంద్రీ-నీవా కాలువకు ఇరువైపుల సేద్యపు నీటి వసతులు కల్పిం చే కాలువల పనులను ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. నేడు హంద్రీ- నీవాను కుదించి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, కుప్పం తదితర ప్రాంతాలకు నీటిని తీసుకుని వెళ్లాలని బాబు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలు అనంతపురం జిల్లా వాసులను కలవరపెడు తున్నాయి. అనంతపురం ప్రజలు ఏ రోజూ చిత్తూరు జిల్లా తాగు, సాగునీటి అవసరాలకు వ్యతిరేకం కాదు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో కేటాయించిన జలా లతో ఈ ప్రాంత అవసరాలను తీర్చి చిత్తూరు, కడప జిల్లాల అవసరాలకు కృష్ణా జలాలను తరలించాలని మాత్రమే ఈ జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఒక ఏడాదిలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి తరలించడం జరు గుతుందని, ఆ మేరకు అదే సామర్థ్యపునీటిని ఎగువ శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాలు తీర్చడానికి జరుగుతున్న కృషిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారని బాబు ఆరోపణలు చేశారు. పట్టి సీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాలోకి తరలిం చడం జరిగినప్పుడు ఎగువన శ్రీశైలం నుంచి ఆ మేరకు నీటిని హంద్రీ-నీవాకు, గాలేరు-నగరికి శ్రీశై లం కుడికాలువ ద్వారా మరియు కేసీ కెనాల్‌కు నీటిని కేటాయించి రాయలసీమ అవసరాలు తీర్చ గలిగే అవకాశమున్నప్పుడు హంద్రీ-నీవాను కుదిం చాల్సిన అవసరమేమిటి? పట్టిసీమను జగన్ మోహ న్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారని విషప్రచారం చేసిన బాబు తానెందుకు పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేస్తు న్నారు? ఒక ప్రాజెక్టుకు మార్పులు, చేర్పులు జరిపే టప్పుడు రైతు సంఘాలతో, ప్రతిపక్ష నాయకులతో, కేబినెట్ మంత్రులతో చర్చలు జరిపే సంప్రదాయా లు ఎందుకు వదులుకుంటున్నారు? 1972 కేంద్ర ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన నిరంతర కరువు పీడిత ప్రాంతాలు కేవలం వర్షాధా రిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వ్యవసాయం అటకెక్కింది. రైతులు దివాళా తీశారు. లక్షల సంఖ్యలో అనంతపు రం, చిత్తూరు, కడప, కర్నూలు, మెట్ట ప్రాంతాల లోని వ్యవసాయ కూలీలు, రైతులు, మహిళలు పొట్ట చేత పట్టుకుని కూలి పనుల కోసం నగరాలకు వలస బాట పట్టారు. వేల గ్రామాలలో తాగునీటి ఎద్దడి తీవ్రత మనం ఎదుర్కొంటున్నాం. అనంతపురం జిల్లాలో 2 లక్షల బోరు బావులు భూగర్భ జలాలను లాగివేశాయి. అలాగే కడప జిల్లాలోని రాయచోటి తదితర ప్రాంతాలలో తాగు నీరే దొరకని పరిస్థితి. ఇంత సంక్షోభం ఉన్న ప్రాంతాల అవసరాలు తీర్చ డానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కోట్లు వెచ్చిం చి ఎవరూ సాహచించని ఎత్తిపోతల పథకం, హంద్రీ నీవా గురించి చేసిన ఆలోచన ఎంత గొప్పది. ఆ ప్రాజెక్టు పట్ల నిరంతరం విషం కక్కుతూ... వైఎస్‌పై, జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిం చిన బాబు చేస్తున్నది ఏమిటి? నిజంగా చంద్రబా బులో ఏ మాత్రం ప్రజాస్వామిక విలువలు ఉన్నా సేద్య పు నీటి ప్రాజెక్టులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయడానికి సాహసించగలరా? సీమవాసుల, ప్రత్యే కించి అనంతపురం జిల్లావాసుల అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయగలరా? (వ్యాసకర్త కదలిక సంపాదకులు) మొబైల్: 99899 04389 -
రైతన్నకు గంజే గతి!
హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయకపోతే రైతులకు గంజే గతి అంటూ సీపీఎం నేతలు గంజి తాగుతూ నిరసన వ్యక్తం చేశారు. హంద్రీ-నీవాకు నిధులు కేటాయించాలన్న డిమాండ్‌తో శుక్రవారం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. అనంతపురం టౌన్: హంద్రీ నీవా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించి సత్వరం పనులు చేపట్టి పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఁఉగాది నాడు కూడా గంజేనా..?* అంటూ నాయకులు రోడ్డుపై బైఠాయించి గంజి తాగి వినూత్న నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే హంద్రీ నీవా ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హమీని అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రూ.2 వేల కోట్లు అవసరమైతే కేవల రూ. 200 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వ మోసపూరిత వైఖరి కి నిదర్శనమన్నారు. జిల్లాలో దాదాపు వెయ్యి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తుంగభద్ర కాలువ ఆధునికీకరణకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయంచలేదన్నారు. ఉపాధి హామీకి సంబంధించి రూ.40 కోట్ల కూ లి బకాయీలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతులకు రూ.1,200 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందాల్సి ఉందన్నారు. జిల్లాకు నిధులు సాధించడంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, నాయకులు చండ్రాయుడు, రంజిత్, వెంకటనారాయణ, ప్రకాశ్, ముస్కిన్, తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి
25 గంటల దీక్ష ముగింపులో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఐదేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయూలని నేను చేస్తున్న దీక్షకు భారీగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వామపక్షాల, ప్రజా, కుల సంఘాల నేతలు తరలివచ్చారు. ఇంత మంది సంఘీభావం తెలిపారంటే ఈ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైందో అర్థమవుతోంది. దీక్ష తో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. హంద్రీ-నీవా గురించి మంత్రులు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. పోరాటాలతోనే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం’ అని వైఎస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు 100 టీఎంసీల నికర జలాలను కేటాయించి ఈ ఖరీఫ్ నుంచే నీరు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ యన అనంతపురం జిల్లా ఉరవకొండలో చేపట్టిన 25 గంటల దీక్ష గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఎమ్మెల్సీ దేవగుడి నా రాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనాథరెడ్డి లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిస్తాం ‘చంద్రబాబు హాయాంలో రెండుసార్లు హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేసి విస్మరించారని, ఆయున హాయాంలో రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. దీక్ష వేదికపై ఆయున వూట్లాడారు. -
జగన్ దీక్షకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభం
ఉరవకొండ: పశ్చివు గోదావరి జిల్లా తణుకులో ఈనెల 31 నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టే 48 గంటల దీక్షకు, అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేయూలని కోరుతూ ఈ నెల 28, 29 తేదీల్లో ఉరవకొండలో తన సోదరుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టే 25 గంటల దీక్షకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై. వుధుసూదన్‌రెడ్డి సోవువారం ఉరవకొండ నుంచి పాదయూత్ర చేపట్టారు. అనంతపురంలో ఈ యూత్ర ముగుస్తుంది.