హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయకపోతే రైతులకు గంజే గతి అంటూ సీపీఎం నేతలు గంజి తాగుతూ నిరసన వ్యక్తం చేశారు.
హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేయకపోతే రైతులకు గంజే గతి అంటూ సీపీఎం నేతలు గంజి తాగుతూ నిరసన వ్యక్తం చేశారు. హంద్రీ-నీవాకు నిధులు కేటాయించాలన్న డిమాండ్‌తో శుక్రవారం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు.
అనంతపురం టౌన్: హంద్రీ నీవా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించి సత్వరం పనులు చేపట్టి పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఁఉగాది నాడు కూడా గంజేనా..?* అంటూ నాయకులు రోడ్డుపై బైఠాయించి గంజి తాగి వినూత్న నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే హంద్రీ నీవా ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హమీని అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
రూ.2 వేల కోట్లు అవసరమైతే కేవల రూ. 200 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వ మోసపూరిత వైఖరి కి నిదర్శనమన్నారు. జిల్లాలో దాదాపు వెయ్యి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తుంగభద్ర కాలువ ఆధునికీకరణకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయంచలేదన్నారు. ఉపాధి హామీకి సంబంధించి రూ.40 కోట్ల కూ లి బకాయీలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతులకు రూ.1,200 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందాల్సి ఉందన్నారు. జిల్లాకు నిధులు సాధించడంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, నాయకులు చండ్రాయుడు, రంజిత్, వెంకటనారాయణ, ప్రకాశ్, ముస్కిన్, తదితరులు పాల్గొన్నారు.