గుంటూరులో సీపీఎం ఆందోళన.. ఉద్రిక్తత | Police Arrest CPM Leader Maduh | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 11:39 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Police Arrest CPM Leader Maduh - Sakshi

సాక్షి, గుంటూరు : నగరంలో గురువారం ఉదయం సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో అమాయకులను అరెస్టు చేశారంటూ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారిని పరామర్శించేందుకు ఆయన గురువారం పోలీసు స్టేషన్‌ వచ్చారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయినా మధు వెనుకకు తగ్గకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సీపీఎం శ్రేణులు పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement