పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి | Poratalatone pressure on the government | Sakshi

పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి

Jan 30 2015 3:45 AM | Updated on Aug 14 2018 5:56 PM

పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి - Sakshi

పోరాటాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి

‘ఐదేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయూలని నేను చేస్తున్న దీక్షకు భారీగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు...

  • 25 గంటల దీక్ష ముగింపులో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
  • ఉరవకొండ నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఐదేళ్ల వరకూ ఎలాంటి ఎన్నికలు లేవు. హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయూలని నేను చేస్తున్న దీక్షకు భారీగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వామపక్షాల, ప్రజా, కుల సంఘాల నేతలు తరలివచ్చారు. ఇంత మంది సంఘీభావం తెలిపారంటే ఈ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైందో అర్థమవుతోంది. దీక్ష తో ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. హంద్రీ-నీవా గురించి మంత్రులు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.

    పోరాటాలతోనే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం’ అని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు 100 టీఎంసీల నికర జలాలను కేటాయించి ఈ ఖరీఫ్ నుంచే నీరు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ యన అనంతపురం జిల్లా ఉరవకొండలో చేపట్టిన 25 గంటల దీక్ష గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఎమ్మెల్సీ దేవగుడి నా రాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనాథరెడ్డి లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
     
    ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిస్తాం

    ‘చంద్రబాబు హాయాంలో రెండుసార్లు హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేసి విస్మరించారని,  ఆయున హాయాంలో రూ. 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని  కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. దీక్ష వేదికపై ఆయున వూట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement