![Chinese Woman Sues Male Colleague For Breaking Her Ribs while Hugging - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/17/woman_0.jpg.webp?itok=f7gTIUZX)
తనను గట్టిగా కౌగిలించుకోవడంపై కోపగించుకున్న ఓ మహిళ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ ఆఫీసులో ఉండగా మగ సహోద్యోగి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కౌగిలింతతో ఆమె నొప్పితో విలవిల్లాడిపోయి గట్టిగా కేకలు వేసింది. అతను విడిచిపెట్టిన తర్వత కూడా ఛాతీలో నొప్పి రావడంతో తాత్కాలికంగా ఆయిల్ మసాజ్ చేసుకొని ఉపశమనం పొందింది.
అయితే అయిదు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయి. మహిళ ఆసుపత్రి బిల్లులకు భారీగా డబ్బు ఖర్చైంది. అంతేగాక ఆమె ఉద్యోగానికి కూడా వెళ్లేని పరిస్థితి రావడంతో ఆదాయాన్ని కోల్పోయింది. అనంతరం కోలుకుంటున్న సమయంలో సదరు మహిళ తనను హగ్ చేసుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన పరిస్థితిని తెలిపింది. అయితే ఆ వ్యక్తి తన కౌగిలింత వల్ల ఇంత గాయం అయ్యిందా? రుజువు ఏంటని ఆమెనే ఎదరు ప్రశ్నించాడు.
చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు
దీంతో చివరికి ఆ మహిళ చివరికి తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది, తన ఆర్థిక నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు 10,000 యువాన్లు (రూ. 1.16 లక్షలు) పరిహారంగా చెల్లించాలని సహోద్యోగిని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ అయిదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ కార్యకలాపంలో కూడా మహిళ పాల్గొన్నట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment