సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆలింగనం చేసుకున్న సమయంలో విమర్శలు గుప్పించిన రాహుల్.. మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేశారు.
ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గృహనిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో.. ట్విటర్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ వ్యంగ్య విమర్శలు చేశారు. ‘ప్రధాని మోదీజీ.. సత్వరం మరిన్ని ఆలింగనాలు కావాలి.. త్వరపడండి’ అంటూ ట్వీట్ చేశారు.
‘నరేంద్ర భాయ్.. ముంబై సూత్రధారి బయటకు వచ్చాడు. లష్కరే తోయిబా నుంచి పాక్ మిలటరీ ఫండింగ్‌ను ట్రంప్ వేరు చేశాడు. మీ ఆలింగనాల దౌత్యం విఫలమైంది (హగ్‌ప్లోమసీ). కాబట్టి సత్వరం మరిన్ని ఆలింగనాలు కావాలి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Narendrabhai, बात नहीं बनी. Terror mastermind is free. President Trump just delinked Pak military funding from LeT. Hugplomacy fail. More hugs urgently needed.https://t.co/U8Bg2vlZqw
— Office of RG (@OfficeOfRG) November 25, 2017
Comments
Please login to add a commentAdd a comment