
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల వేడిమికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా విజయవాడలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో 46.1 డిగ్రీలు, హైదరాబాద్లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో ప్రధానమైన నగరాలు పట్టణాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలో 46.9, కాకినాడలో 44.7, ఒంగోలులో 44.3, తిరుపతిలో 42, నెల్లూరులో 42.1, అనంతపురంలో 41.2, కర్నూలులో 41.5, కళింగపట్నం 36, విశాఖపట్నంలో 34.1, హన్మకొండ 45.8, రామగుండం 46.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.