ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్‌లలో మూడు అంకెలలో ఉంది.
పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment