prices of goods
-
వంట చేయాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వేడిగాలులు ఈ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయలు, పప్పుల ధరలపైన కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా బంగాళదుంపలు, టమాటా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత అస్థిరంగా ఉంటుంది. వేడిగాలులు, భారీ వర్షాలు, పంట నష్టం మొదలైన పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 11 నెలల కనిష్ట స్థాయి అంటే 4.8 శాతానికి పడిపోయింది. వెల్లుల్లి, అల్లం ద్రవ్యోల్బణం మార్చి , ఏప్రిల్‌లలో మూడు అంకెలలో ఉంది.పప్పులు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా తగినంతగా లేదు. ప్రతికూల వాతావరణం కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేడిగాలు ఇదే రీతిన కొనసాగితే ధరలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైన అధిక ధరలను అరికట్టడానికి కూరగాయలు, పప్పుల దిగుమతులను సరళీకరించాలని వారు సూచిస్తున్నారు. -
సమతులాహారం... అందని ద్రాక్షే
డి.శ్రీనివాసరెడ్డి: పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు సగం ఉడికిన వంటకంలా ఉన్నాయని ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సదస్సులో అన్నారు. ‘ఇంకా నయం. మోదీ సర్కారు మాదిరిగా నోట్ల రద్దు, జీఎస్టీ బాదుడు, పెట్రో వాతలతో తినడానికే వీలు కాని మాడిపోయిన వంటకమైతే మన్మోహన్ తయారు చేయలేదు’ అంటూ కాంగ్రెస్‌కే చెందిన మరో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రిటార్టిచ్చారు. వంటకాల గోల ఎలా ఉన్నా సగటు భారతీయులు సరైన తిండి తినే భాగ్యానికి నోచుకోవడం లేదు. వారికి సమతులాహారం విలాస వస్తువుగా మారుతున్న దుస్థితి దాపురిస్తోంది...! ఆహారోత్పత్తుల ధరలు కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆహార ధాన్యాలు, ఇంధనం ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు తదితరాలు ఇందుకు కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి చెప్పారు. ► దేశంలో ఏకంగా 71 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ పత్రిక సంయుక్త నివేదిక తేల్చింది. ప్రపంచవ్యాప్త సగటు (42 శాతం) కంటే ఇది చాలా ఎక్కువ! ► సగటు భారతీయ కుటుంబపు ఆహార ఖర్చు గత పదేళ్లలో అక్షరాలా రెట్టింపైంది. ► ముగ్గురుండే కుటుంబానికి వారానికి ఐదు లీటర్ల పాలు, రెండేసి కిలోల బియ్యం, గోధుమ పిండి, టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, లీటరు నూనె, పప్పు ధాన్యాలు, పండ్లు అవసరం. ► వీటన్నింటి ధరలూ ఆహార పదార్థాల ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) ప్రకారమే 2014 నుంచి గత ఎనిమిదేళ్లలోనే 80 శాతం దాకా పెరిగాయి. ► గత ఏడాదిలో చూసుకున్నా దాదాపు 10 శాతం పెరిగినట్టు కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. ధరాభారంతో బెంబేలు ఆదాయం మూరెడు పెరిగితే ధరలు బారెడు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. దాంతో సగటు పౌరునికి పౌష్టికాహారం నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. కుటుంబ ఆదాయంలో ఆహార వ్యయం 63 శాతానికి మించితే వారికి పౌష్టికాహారం దూరమైనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ► ఫలితంగా 21 ఏళ్ల వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లకు బదులు 35.8 గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ► 300 గ్రాముల కూరగాయలకు బదులు 168.7 గ్రాములే అందుతున్నాయి. ► ఈ పౌష్టికాహార లోపం ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలకు దారితీస్తోందని గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు హెచ్చరిస్తోంది. మన థాలి ఖరీదెంత? సగటు భారతీయుడు తినే థాలి (సమగ్ర భోజనం) ఖరీదును తొలిసారిగా 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2020–21లోనూ మరో ప్రయత్నం చేశారు. వాటిలో తేలిందేమిటంటే... ► శాకాహార భోజనం ఖరీదు అండమాన్‌లో అతి ఎక్కువగా రూ. 38.7 , యూపీలో అతి తక్కువగా 23.1 రూపాయలు. ► ఐదుగురున్న కుటుంబపు నెలవారీ భోజన ఖర్చు 2015లో రూ.4,700 ఉంటే ఇప్పుడు రూ.6,700కు పెరిగింది. ► ఓ మాదిరి వ్యక్తి రెండు పూటల ఇంటి భోజనానికి 2015లో సగటున రూ.32 ఖర్చయితే ఇప్పుడు రూ.44కు పెరిగింది. -
నోరు కట్టుకోండి..!
ముందుగా గుండెనిండా గాలిని ప్రశాంతంగా పీల్చుకోండి. బీపీ, సుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నాయో లేదో చూసుకోండి. మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ఆహ్లాదంగా ఉంచుకోండి. ఇదేదో యోగా తరగతుల్లో గురువులు బోధిస్తున్న తీరు అనుకోకండి. ప్రస్తుతం మార్కెట్లకు సరుకులు కొనేందుకు వెళ్లే వినియోగదారులు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోక పోతే గుండెలు గుభేల్ మనక తప్పదు. కూరగాయల నుంచి..నిత్యవసరాల ధరలు చుక్కలను తాకుతుండడంతో ఏర్పడిన పరిస్థితి. నోటిరుచి మాట దేముడెరుగు.. ముచ్చటగా నాలుగు ముద్దలు కూరలతో తిందామన్నా ఖరీదు చేయలేని దుర్భరత. సామాన్య, మధ్య తరగతి వారికి చెమటలు పట్టిస్తున్న రేట్ల తీరు. పాలమూరు, న్యూస్‌లైన్ : బస్తాలో డబ్బులు తీసుకుపోతే.. సంచుల్లో సరుకులు తీసుకునే రోజులు వస్తాయన్న నానుడి ఇప్పుడు అక్షరసత్యాలు అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులను కుదేల్ చేస్తున్నాయి. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పుచారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరుమాసాల కిందట రూ.50 నుంచి రూ.60 ఉన్న పెసర, కందిపప్పు ధరలు ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతోపాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధరకూడా అమాంతంగా పెరిగి పోయింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఎండు కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు సన్న బియ్యం (బీపీటీ) ధరలు కొద్దిగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ వాటికి రెక్కలు వచ్చాయి. పప్పుల ధరలదీ అదేబాట. కూరగాయలదీ అదే రూటు కూరగాయలను కొనుగోలు చేయాలంటేనే అంతా హడలెత్తి పోతునానరు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళితే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా దేన్ని ముట్టుకున్నా కిలో రూ.20కి పైమాటే. ప్రస్తుతం జిల్లాలో కూరగాయలసాగు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.