ఈ ఏడాది భానుడి భగభగలకు మండిపోవడం ఖాయం అని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
లండన్: ఈ ఏడాది భానుడి భగభగలకు మండిపోవడం ఖాయం అని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల కన్నా అత్యధిక ఉష్ణోగ్రత 2015-2016 మధ్య కాలంలో రికార్డు కానుందని తెలిపారు. ప్రస్తుతం భౌగోళిక వాతావరణంలో మార్పులు వేగవంతమయ్యాయని, ఇవి జన జీవనాన్ని మరింత ఇబ్బంది పెట్టనున్నాయని హెచ్చరించారు.
తాజాగా చేసిన అధ్యయనాల్లో భూమి ఉపరితలం ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత స్థాయిని మించిపోయిందని, అది మరింత పెరిగే దిశగా వెళుతోందని వెళ్లడైనట్లు చెప్పారు. గత ఏడాదిలోనే ఎంతో ఆందోళనకరమైన పరిస్థితి కనిపించిందని, అది ఈ ఏడాది కూడా అలాగే ఉండి ఈ రెండు సంవత్సరాలు కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.