'సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండండి' | severe-heat-waves-sweep-telangana-andhra-pradesh | Sakshi
Sakshi News home page

Published Fri, May 22 2015 2:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

భానుడు భగభగలతో జనాలు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి.దాంతోపాటు వడగాడ్పులు అదే స్థాయిలో ఉధృతమవుతున్నాయి. వరసగా నాలుగు రోజుల నుంచి వేడిగాలులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు సుమారు 225మంది మృతి చెందారు. వడదెబ్బకు ఏపీలో 78 మంది, తెలంగాణలో 147 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. శుక్రవారం ఉదయం 9గంటలకే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు చేరిన విషయం తెలిసిందే. కాగా 1966లో హైదరాబాద్ చరిత్రలో 45.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే రానున్న రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. శుక్రవారానికి 45 డిగ్రీలకు చేరే అవకాశముందని తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement