మనం నిత్యం కొన్ని పదార్థాలను నిల్వ చేసేటప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటాం. ఒకవేళ పాడైతే ఎండలో పెట్టడమో లేక ఓ సారి మంటపై వేడిచేయడమో చేస్తాం. కానీ అలా అన్ని వేళలా అన్ని రకాల పదార్థాలకు పనికిరాదు. ఏవీ వేడి చేస్తే మంచిది? వేటిని నేరుగా వేడి చేయకూడదు వంటి ఆసక్తికర ఇంటి చిట్కాలు తెలుసుకుందామా!
- తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకుపోతుంటుంది. అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. తేనెను ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు. ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి. నీటి వేడితో ఐదు – పది నిమిషాల్లో తేనె కరుగుతుంది.
- ఒకవేళ తేనెను నేరుగా వేడిచేస్తే పోషక విలువలు పోయి పాయిజన్‌గా మారిపోతుందట. పైగా నేరుగా వేడి చేయడం వల్ల జిగురు వంటి పదార్థంలా మారిపోతుంది. దాన్ని గనుక ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని, అమా అనే టాక్సిన్‌గా మారుతుంది. దీంతో మనకు కడుపు నొప్పి రావడం, శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగుటం వంటి దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
- పాల ప్యాకెట్‌లు ఫ్రిజ్‌లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్‌లను నేరుగా పెట్టకూడదు. ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చే లోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది. కాబట్టి ప్యాకెట్‌ని నీటితో కడిగి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది.
- వెల్లుల్లి రేకలు పొట్టు సులువుగా వదలాలంటే... వెల్లుల్లి రేకను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుక వైపు (మందంగా ఉండే వైపు, ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది) తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేక తేలిగ్గా విడివడుతుంది.
- పైనాపిల్‌ను కట్ చేయడానికి పెద్ద చాకులను (షెఫ్స్ నైఫ్) వాడాలి. ముందుగా కాయ పై భాగాన్ని, కింది భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి. ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి.
- బటర్‌ను వంట మొదలు పెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్‌లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాలగిన్నె మూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది. అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి.
- ఐస్‌క్రీమ్ సర్వింగ్ స్పూన్‌లు ఇంట్లో ఉండవు. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి. ఒక స్లయిస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది. కాబట్టి ప్రతి స్లయిస్‌కూ ఓ సారి వేడి నీటిలో ముంచాలి.
(చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment