![Pakistan People is Afraid to go Mohatta Palace - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/5/mahal.gif.webp?itok=BnS9OCWr)
ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ పట్టణంలోనూ అటువంటి మహల్ ఒకటి ఉంది. సూర్యాస్తమయం అయ్యాక ఈ మహల్ సమీపంలోకి రావాలంటే ఎవరైనా భయంతో వణికిపోతారు. అటువంటి సాహసం కూడా ఎవరూ చేయరు.
రాత్రి వేళ విచిత్ర శబ్ధాలు
పాకిస్తాన్‌కు చెందిన లోకల్ డిజిటల్ పబ్లికేషన్ బ్రాండ్ సినారియోలో ప్రచురితమైన వివరాల ప్రకారం ప్యాలెస్ పరిసరాల్లో రాత్రివేళ విచిత్రమైన శబ్ధాలు వస్తుంటాయి. భవనంలో పెద్ద ఎత్తున పార్టీలు జరుగున్నట్లు రాత్రి వేళ ఏవో శబ్ధాలు వస్తుంటాయని చెబుతారు. 1927లో రాజస్థాన్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను పాకిస్తాన్ సర్కారు మ్యూజియంగా మార్చివేసింది. అయినప్పటికీ నేటికీ రాత్రి వేళ ఇక్కడకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు.
అనారోగ్యం పాలైన భార్య కోసం..
ఈ ప్యాలెస్ నిర్మాణ విషయానికి వస్తే చరిత్రలో పేర్కొన్న వివరాల ప్రకారం 1927లో రాజస్థాన్‌కు చెందిన శివరతన్ చంద్రరతన్ అనే మార్వాడీ వ్యాపారి తన భార్యపై తనకున్న ప్రేమకు గుర్తుగా ఈ ప్యాలెస్ నిర్మింపజేశారు. శివరతన్ చంద్రరతన్ దంపతుల ప్రేమ కథ అటు పాక్‌లోనూ, ఇటు భారత్‌లోనూ వినిపిస్తుంటుంది. శివరతన్ చంద్రరతన్ మొహట్టా భార్య తీవ్రమైన వ్యాధి బారిన పడింది. ఈ నమయంలో వైద్యులు అతనికి ఒక సలహా ఇచ్చారు. సముద్రపు వేగవంతమైన గాలి తగిలే ప్రాంతంలో ఆమెను ఉంచితే, ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు ఆ వ్యాపారికి సూచించారు. వారి సలహా వినగానే ఆ వ్యాపారి రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ప్రముఖ కళాకారులను పిలిపించి, ఈ ప్యాలెస్‌ను నిర్మింపజేశారు. ఆ సమయంలో ఈ ప్యాలెస్‌లో లెక్కకుమించిన సంఖ్యలో విందువినోద కార్యక్రమాలు జరిగేవని చెబుతుంటారు.
సొరంగం గుండా ఆలయానికి మార్గం
అత్యంత ఆదరణ పొందిన ఈ మొహట్టా మహల్ కింది భాగంలో ఒక సొరంగం ఉంది. ఇది కరాచీలోని ఒక ప్రముఖ హిందూ దేవాలయానికి దారితీస్తుందని చెబుతారు. శివరతన్ చంద్రరతన్ మొహట్టా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆలయానికి చేరుకునేందుకే ఈ సొరంగం నిర్మించారట. ఈ మార్గం గుండానే శివరతన్ చంద్రరతన్ భార్య ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుండేవారట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బ్రిటీష్ పాలనా కాలంలో ఈ ప్యాలెస్ పలు అక్రమ కార్యకలాపాలకు నిలయంగా ఉండేదని, అందుకే దీనికి భూతాల నిలయం అనే పేరు వచ్చింటారు.
ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
Comments
Please login to add a commentAdd a comment