'Ashish Chanchlani Vines అనే యూట్యూబ్ చానెల్‌తో clout అయ్యాడు. కామెడీ వీడియోస్‌కి వెల్‌నోన్. అమ్మాయిగా.. తండ్రిగా.. కొడుకుగా.. ఇలా డిఫరెంట్ రోల్స్ వేయడంలో ఆశీష్‌ని మించిన క్రియేటర్ లేడు. సోషల్ మీడియాలో, స్టూడెంట్ లైఫ్, ఎగ్జామ్స్, ఆఫీస్ డ్రామా, ఫ్యామిలీ ఇష్యూస్.. ఇలా ఈ కుర్రాడు ఫోకస్ చేయని టాపిక్ లేదు.'
సబ్జెక్ట్ ఏదైనా హిలేరియస్ ట్విస్ట్స్ కడుపుబ్బా నవ్వించే కంటెంట్ని చూపిస్తాడు. ఆశీష్ పుట్టి, పెరిగింది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్‌లో. ఇంజినీరింగ్ చదువు కోసం నవీ ముంబై చేరాడు. ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ అతనిలో యాక్టింగ్ ఇన్‌స్టింక్ట్ ఉండటంతో టీన్స్‌లో అది డామినేట్ చేసింది. దాంతో మధ్యలోనే ఇంజినీరింగ్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఆ గట్స్ అండ్ గట్ ఫీలింగ్‌తో సోషల్ మీడియాలో జర్నీ స్టార్ట్ చేశాడు.
యూట్యూబ్ చానెల్ పెట్టి.. చదువు మధ్యలోనే వదిలేసినందుకు రిగ్రెట్ ఫీలయ్యే చాన్స్ ఆశీష్కివ్వలేదు డెస్టినీ! ఫన్నీ వీడియోస్‌తో వితిన్ ద షార్ట్ టైమ్ వెరీ పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే బాలీవుడ్ బిగ్గీస్ తమ మూవీస్‌కి అతనితో ప్రమోషనల్ వీడియోస్ చేయించుకునేంతలా! అంతేకాదు షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో కలసి యాడ్స్ చేశాడు.
ఇంకో ఇంపార్టెంట్ థింగ్.. 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' అనే హాలీవుడ్ మూవీలో కూడా యాక్ట్ చేశాడు. 'ఆఫ్రీ సఫర్' అనే షార్ట్ హారర్ ఫిల్మ్ తీసి తనలోని డైరెక్షన్ చూపించాడు. ఆశీష్ యూట్యూబ్ చానెల్, ఇన్స్టా హ్యాండిల్ వంటి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్‌కి బిలియన్ల వ్యూస్.. రెండు అంకెల మిలియన్ల ఫాలోవర్స్.. అంతకన్నా ఎక్కువ రేంజ్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు లక్షల్లో ఆమ్దనీ వస్తోంది. అవార్డులు కూడా బాగానే గెలుచుకున్నాడు.
'బెస్ట్ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్' కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ అందుకున్నాడు. వరల్డ్ బ్లాగర్స్ అవార్డ్స్ ప్రారంభించిన ఏడాదే (2019) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'బెస్ట్ కామెడీ ఇన్‌ఫ్లుయెన్సర్' అవార్డును సాధించాడు. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ లిస్ట్ అయ్యాడు. కాన్ఫిడెన్స్ ఉంటే కేన్స్ దాకా వెళ్లొచ్చని భలే ప్రూవ్ చేశాడు కదా!
ఇవి చదవండి: అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు .. డైట్ సీక్రెట్స్ ఇవే..
Comments
Please login to add a commentAdd a comment