
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వీట్ హోమ్ వద్ద పార్కింగ్ సదుపా యం లేకపోవడంతో కొనుగోలుదారులు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
ఆదివారం రోజున గాంధీచౌక్ నుంచి మమత సర్కిల్ వరకు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో స్వీట్‌హోం నిర్వాహకులు గొడవపడ్డారని, ఆ తరువాత పోలీసుల వేధింపుల కారణంగా స్వీట్‌హోంను మూసివేస్తున్నామని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి న్యూసెన్స్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ వాలా స్వీట్ హోంపై బీఎన్‌ఎస్ కింద క్రైం నంబర్ 343/2024, యూ/ఎస్ 221, 224, 285 కింద కేసు నమోదు చేసి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదిక పంపించినట్లు ప్రకటనలో తెలిపారు. ఢిల్లీవాలా స్వీట్ హోం వారు పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి ని శాఖ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment