
సాక్షి, అనాకపల్లిటౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆవరణలో ఆదివారం వినూత్నరీతిలో తులాభారం నిర్వహించారు. వ్యాపారవేత్త మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతులు తమ కుమార్తె భవిష్యకు తులాభారం వేస్తామని అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. టమాటాలు, బెల్లందిమ్మలు, పంచదార 51 కిలోల చొప్పున తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు.
వీటితోపాటు జీడిపప్పు, కిస్మిస్ కూడా అందజేశారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు శ్రీను, ఆలయ సిబ్బంది తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. టమాట ధరల మంటతో జనం అల్లాడుతున్న సంగతి తెలిసిందే. టమాటాల తులాభారం అనేసరికి ఈ వార్త వైరల్‌గా మారింది.
(చదవండి: టమాట కేజీ రూ. 300?.. ఎందుకంటే..)