అఖిల్ను భయపెట్టిన అమ్మాయిలు!! | women's college students tease akhil akkineni | Sakshi
Sakshi News home page

అఖిల్ను భయపెట్టిన అమ్మాయిలు!!

Published Wed, Dec 17 2014 3:17 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అఖిల్ను భయపెట్టిన అమ్మాయిలు!! - Sakshi

అఖిల్ను భయపెట్టిన అమ్మాయిలు!!

నిత్య నవ మన్మధుడు నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఇంకా ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయిలో నటించలేదు. కానీ అప్పుడే మనోడికి అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయింది. మొన్నీమధ్య మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో 'మేకింగ్ ఎ డిఫరెన్స్' అనే కార్యక్రమానికి అఖిల్ అతిథిగా వెళ్లాడు. కుర్రాడు ఎర్రగా, బుర్రగా ఉన్నాడని.. అక్కడి అమ్మాయిలు అతడిని తెగ టీజ్ చేశారని సమాచారం. చాలామంది షేక్ హ్యాండ్లు ఇచ్చి, సెల్ఫీలు తీసుకున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా అఖిల్ మోహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి అతగాడిని తెగ భయపెట్టేశారని తెలిసింది.

దీంతో అఖిల్‌  కంగారు పడిపోయాడు. ఎలాగోలా అక్కడి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాననిపించి, అక్కడినుంచి బయట పడ్డాడట. ఇప్పటికే పలుమార్లు తారల క్రికెట్ పోటీలలో తన సత్తా చూపించిన అఖిల్.. ఇటీవలే అక్కినేని మూడు తరాలతో తీసిన 'మనం' సినిమాతో తెరంగేట్రం చేశాడు. అందులో చేసింది ఒక్క సీనే అయినా.. అఖిల్ అభిమానుల సంఖ్యకు మాత్రం కొదవేమీ లేదు. అందుకే టైటాన్ వాచీలు, మౌంటెన్ డ్యూ డ్రింక్ కంపెనీలు అక్కీని తమ బ్రాండ్ అంబాసడర్గా పెట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement