teasing
-
ప్రగ్యా జైస్వాల్‌ను ఆటపట్టించిన విష్ణు
-
బాలికపై అసభ్య ప్రవర్తన: యువకుడికి దేహశుద్ధి
హైదరాబాద్: కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మూసాపేట్లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్ధానిక అపార్టుమెంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాచ్‌మన్‌గా ఉంటున్నాడు. అతని కుమార్తె(7) రెండో తరగతి చదువుతోంది. యాదవ బస్తీలో నివసించే సునీల్(19) శుక్రవారం పాఠశాల ముగిశాక ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సునీల్ ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేసి పెయింటర్‌గా పనిచేస్తున్నాడని, నిందితుడిపై నిర్భయ, పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాలిక తనను ముందుగా రెండు రూపాయలు అడిగిందని, తాను ఇచ్చాక మళ్లీ పది రూపాయలు అడిగితే ఇస్తున్న సమయంలో స్థానికులు తనను కొట్టారని సునీల్ పోలీసులకు తెలిపాడు. -
అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి దేహశుద్ధి
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులోని స్వాతి ఉమెన్స్‌హాస్టల్‌లో ఉండే ఓ యువతి(22) ఉదయం 6గంటల సమయంలో హాస్టల్ నుంచి నడిచి వెళ్తుండగా సదర్‌ల్యాండ్ హెల్త్కేర్లోఫార్మాలో పనిచేసే నవీజీవన్ అనే యువకుడు ఆమెను అడ్డగించాడు. అసభ్యకరంగా ప్రవర్తించటంతో బాధితురాలు కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
అఖిల్‌ను భయపెట్టిన అమ్మాయిలు!!
నిత్య నవ మన్మధుడు నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ ఇంకా ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయిలో నటించలేదు. కానీ అప్పుడే మనోడికి అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయింది. మొన్నీమధ్య మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో 'మేకింగ్ ఎ డిఫరెన్స్' అనే కార్యక్రమానికి అఖిల్ అతిథిగా వెళ్లాడు. కుర్రాడు ఎర్రగా, బుర్రగా ఉన్నాడని.. అక్కడి అమ్మాయిలు అతడిని తెగ టీజ్ చేశారని సమాచారం. చాలామంది షేక్ హ్యాండ్లు ఇచ్చి, సెల్ఫీలు తీసుకున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా అఖిల్ మోహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి అతగాడిని తెగ భయపెట్టేశారని తెలిసింది. దీంతో అఖిల్ కంగారు పడిపోయాడు. ఎలాగోలా అక్కడి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాననిపించి, అక్కడినుంచి బయట పడ్డాడట. ఇప్పటికే పలుమార్లు తారల క్రికెట్ పోటీలలో తన సత్తా చూపించిన అఖిల్.. ఇటీవలే అక్కినేని మూడు తరాలతో తీసిన 'మనం' సినిమాతో తెరంగేట్రం చేశాడు. అందులో చేసింది ఒక్క సీనే అయినా.. అఖిల్ అభిమానుల సంఖ్యకు మాత్రం కొదవేమీ లేదు. అందుకే టైటాన్ వాచీలు, మౌంటెన్ డ్యూ డ్రింక్ కంపెనీలు అక్కీని తమ బ్రాండ్ అంబాసడర్‌గా పెట్టుకున్నాయి. -
ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం
వేధింపులకు పాల్పడేవారికి జైలుతోపాటు భారీ జరిమానా రెండోసారి అయితే నిర్భయ కేసు యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని బలోపేతం చేస్తూ కొత్త చట్టం ముసాయిదాకు కేబినెట్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఇకపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారు కటకటాలు లెక్కించడంతోపాటు భారీ జరిమానా చెల్లించక తప్పదు! ఈ మేరకు శిక్షలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇప్పటికే ఉన్న యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈవ్ టీజింగ్ నిరోధ చట్టాన్ని రూపొందిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రత కమిటి చేసిన సిఫారసుల ఆధారంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. ఈ చట్టం ముసాయిదాను ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిం చింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే నిందితులకు జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించనున్నారు. నేర తీవ్రత బట్టి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మొదలుకుని ప్రతి ప్రైవేటు సంస్థల్లో ఈవ్ టీజిం గ్ను నిరోధించడానికి యాజమాన్యం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. లేకుంటే యాజమాన్యాన్ని కూడా శిక్షించవచ్చని ఈ ముసాదాలో పేర్కొన్నారు. టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి పట్టుబడితే నిర్భయ కేసు పెట్టాలని సూచించారు. టీజింగ్ కారణంగా ఎవరైనా మరణి స్తే నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించే నిబంధనను కూడా చేర్చినట్టు సమాచారం. -
మళ్ళీ ఈవ్‌టీజింగ్‌కు పాల్పకుండా చేశారిలా..!
-
ఐపీఎస్ అధికారి భార్యకూ వేధింపులు!!
ఐపీఎస్ అధికారి భార్యను వేధించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని హజ్రత్‌గంజ్ ప్రాంతానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఓ మాల్లో జరిగింది. సీబీసీఐడీలో పనిచేసే సదరు అధికారి భార్య.. షాపింగ్ కోసమని మాల్‌కు వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు ఆమె వెంట వెళ్లి, వేధించడం మొదలుపెట్టారు. దాంతో ఆమె వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి తన భర్తకు ఈ విషయం చెప్పారు. ఫోన్ చేసినది తమ ఉన్నతాధికారి భార్య కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం మాల్లోని సీసీటీవీ ఫుటేజ్ చూసి.. అకిల్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్, గులాం అలీ, పర్వేజ్ ఆలమ్ అనే నలుగురిని అరెస్టు చేశారు.