బాలికపై అసభ్య ప్రవర్తన: యువకుడికి దేహశుద్ధి
Published Fri, Dec 16 2016 7:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మూసాపేట్‌లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్ధానిక అపార్టుమెంట్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాచ్‌మన్‌గా ఉంటున్నాడు. అతని కుమార్తె(7) రెండో తరగతి చదువుతోంది. యాదవ బస్తీలో నివసించే సునీల్(19) శుక్రవారం పాఠశాల ముగిశాక ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సునీల్ ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేసి పెయింటర్‌గా పనిచేస్తున్నాడని, నిందితుడిపై నిర్భయ, పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాలిక తనను ముందుగా రెండు రూపాయలు అడిగిందని, తాను ఇచ్చాక మళ్లీ పది రూపాయలు అడిగితే ఇస్తున్న సమయంలో స్థానికులు తనను కొట్టారని సునీల్ పోలీసులకు తెలిపాడు.
Advertisement
Advertisement