సాక్షి, హైదరాబాద్: కాలేజీ విద్యార్థుల సరదాలు తీర్చేందుకు స్వల్పకాలిక ఈజీ లోన్స్(తేలికగా రుణం) ఇచ్చేందుకు కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు ముందుకొచ్చాయి. విద్యార్థులు ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, బైక్, స్మార్ట్‌ఫోన్ తదితర వస్తువుల కొనుగోలుకు రూ.3 వేల నుంచి 80 వేల వరకు రుణం మంజూరు చేసే సంస్థలను ఆశ్రయిస్తున్న గ్రేటర్ విద్యార్థుల సంఖ్య సిటీలో వేలల్లోకి చేరుకుంది. ఇదే అదనుగా నకిలీ ఐడెంటిటీ కార్డులతో రుణం పొంది ఎగవేస్తున్న విద్యార్థులు సైతం ఉండడంతో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిణామం శ్రుతి మించితే రుణ చెల్లింపుల విషయంలో తల్లిదండ్రులకు తలనొప్పులు తప్పవంటున్నారు విద్యావేత్తలు.
ఈజీ లోన్స్ ఇలా..
► ప్రతి అంశాన్నీ ఒక్క క్లిక్‌తో తెలుసుకునే గ్రేటర్ స్టూడెంట్స్ తాజాగా స్వల్పకాలిక తేలికపాటి రుణాలు పొందేందుకు పలు ఆన్‌లైన్ క్రెడిట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
►మహానగరం పరిధిలో సుమారు 300 ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు వీటిని ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
► ప్రధానంగా క్రెడిట్ 24, క్వికర్‌లోన్, ఎం పాకెట్ తదితర సంస్థలు ఈ విషయంలో ముందున్నాయి.
► ఇక ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల వద్దకే ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు తరలివస్తున్నారు. తొలుత ర.3 వేల నుంచి ర.5 వేల వరకు స్వల్పకాలిక సూక్ష్మ రుణాలు అందజేస్తున్నారు.
► ఈ చిన్నపాటి రుణాలను సకాలంలో తీర్చినవారికి గరిష్టంగా రూ.80 వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రుణగ్రహీత సౌలభ్యాన్ని బట్టి నెలవారీగా కొంత మొత్తాన్ని వాయిదాగా చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి.
► ఇక రుణం జారీ చేయాలంటే విద్యార్థుల కళాశాల ఐడెంటిటీ కార్డు, ఇంటి చిరునామ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులను పూచీకత్తుగా స్వీకరిస్తున్నాయి.
► ముందుజాగ్రత్తగా వారి నుంచి రుణం జారీ షరతులకు సంబంధించి రెండు పేజీల నిబంధనల పత్రాలపై సంతకాలు తీసుకుంటుండడం గమనార్హం.
ఎగవేతదారులూ షరామామూలే..
విద్యార్థులు చిన్నపాటి అవసరాలు, సరదాలను తీర్చేందుకు ఈజీ లోన్స్ బాగానే ఉన్నా..ఇదే అదనుగా తమ మిత్రులు, తెలిసినవారి కళాశాలల ఐడెంటిటీ కార్డులు, జిరాక్స్ ప్రతులను సేకరిం ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న అక్రమార్కులూ ఉన్నట్లు ఆయా రుణజారీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. తీరా రుణం మంజూరు చేశాక ఆరా తీస్తే సదరు విద్యార్థి ఆ కళాశాలలో చదవడం లేదన్న నిజాలు వెలుగుచూస్తుండడంతో ఆయా సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తుండడం గమనార్హం. ఇక కొన్ని రుణజారీ సంస్థలు రుణ వాయిదాల వసూళ్ల కోసం తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లు చేస్తుండడం, వారి ఇళ్లకు వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
జాగ్రత్తలూ అవసరమే..
► విద్యార్థుల అవసరాలకు ఈజీలోన్స్ ఒక పరిమితికి మించి అవసరమే కానీ..శృతి మించితే అనర్థాలు తప్పవని విద్యావేత్తలు, కళాశాలల Ķæజవన్యాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల జీవనశైలిలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని సచిస్తున్నారు. అప్పులు చేసి గొప్పలకు పోతే విద్యార్థుల జీవితాలు ప్రవదంలో పడినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఇక రుణం తీసుకునే సమయంలో గుడ్డిగా సంతకాలు చేయకుండా జాగ్రత్తగా షరతులతో కూడిన నిబంధనలను అమూలాగ్రం చదివి సంతకం చేయాలని సచిస్తున్నారు. పరీక్ష, ట్యూషన్, కోచింగ్‌లు, పుస్తకాల కొనుగోలు, నూతన కోర్సులు నేర్చుకునేందుకు రుణం పొందితే ఫర్వా లేదని.. విలాసవంతమైన జీవనశైలి గడిపేందుకు రుణం తీసుకుంటే చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment