విద్యార్థి గ్రూపుల దాడులతో చెన్నైలో ఓ రైల్వే స్టేషన్ అట్టుడికింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా మారి.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన చెన్నై శివారులోని అంబత్తూరు-కొరట్టూరు నడుమ పట్టరైవాకంలో చోటుచేసుకుంది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.