కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి | midday meals provide to college students | Sakshi
Sakshi News home page

కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి

Published Mon, Jul 25 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

midday meals provide to college students

మంచిర్యాల సిటీ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మంచిర్యాలలోని కళాశాల వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లెల శ్రీకాంత్‌ మాట్లాడుతూ జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన రాష్ట్ర డెప్యూటీ సీఎం నేటికీ తన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే భోజనం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిచో తమ సంఘం చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, కె సాయి, కె.కుమార్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement