
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెబుతుంటే ప్రత్యర్థులు మాత్రం ఒప్పుకోవడం లేదు. కాషాయ పార్టీకి ఓటమి తప్పదని ఢంకా బజాయిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంతా చెత్త అంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ కొట్టిపారేశారు. బీజేపీ తప్పకుండా ఓడిపోతుందని, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాద్గామ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేశ్ పోటీ చేశారు.
న్యాయవాది-హక్కుల కార్యకర్త అయిన జిగ్నేశ్.. పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ థాకూర్‌తో కలిసి బీజేపీని వ్యతిరేకించారు. అల్పేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, హార్దిక్ హస్తం పార్టీకి మద్దతు ప్రకటించారు. జిగ్నేశ్‌పై పోటీపై పెట్టకుండా కాంగ్రెస్ పరోక్షంగా ఆయనకు సహకరించింది. వాద్గామ్ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా, లేదా అనేది రేపు (సోమవారం) తేలిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment