గౌరి లంకేశ్(ఫైల్)
సాక్షి, బెంగళూరు: ‘ఎవరైనా మరణిస్తే శ్రద్ధాంజలి ఘటించి వదిలేస్తాం. కానీ గౌరి లంకేశ్ హత్యకు గురైతే.. ఆ దారుణాన్ని లక్ష గొంతులు ప్రశ్నించాయి’ అని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేశ్ 56వ జయంతి సందర్భంగా సోమవారం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ‘గౌరి డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘రోహిత్ వేముల మరణం, గౌరి లంకేశ్ హత్యను నిరసిస్తూ అనేక మంది రోడ్లపైకి వచ్చారు. దేశంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నారు’ అని తెలిపారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ, విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. లంకేశ్ హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తానని గౌరీ సోదరుడు ఇంద్రజిత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment