
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఆశలు బతికాయి. తొలిసారి తమ పార్టీ తరుపున, పార్టీ అండతో బరిలోకి దిగిన ఇద్దరు యువ నేతలు జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ తమ విజయాన్ని ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేష్ వాద్గాం స్థానం నుంచి బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఓబీసీల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టిన అల్పేష్ ఠాకూర్ తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. తొలుత వెనుకబడినట్లు కనిపించినా చివరకు రాధన్‌పూర్ నుంచి గెలుపొందారు. గుజరాత్‌లో ఇది కూడా ఒక అతిపెద్ద నియోజకవర్గం.
గుజరాత్‌లో తీవ్ర స్థాయిలో పటేళ్ల ఉద్యమం జరిగినప్పుడు హార్ధిక్ పటేల్ వెంట ఈ ఇద్దరు ఉన్నారు. అయితే, హార్ధిక్ ప్రస్తుత వయసు 24 ఏళ్లు కావడంతో అతను ప్రచారం మాత్రమే నిర్వహించాడు. జిగ్నేష్ దళిత నేత కాగా అల్పేష్ ఠాకూర్ మాత్రం ఓబీసీల ప్రతినిధి. ఇక జిగ్నేష్‌పై బీజేపీ బరిలోకి దింపిన లావింగ్జి ఠాకూర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తే అయినప్పటికీ అతడు అనూహ్యంగా బీజేపీలో వెళ్లి ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ మద్దతుతోనే బరిలోకి దిగిన ఈ ఇద్దరు నేతలు ప్రచారంలో కూడా బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చారు. ఇక అల్పేష్ ఠాకూర్ అయితే ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపించారు. లక్షల రూపాయల విలువ చేసే పుట్టగొడుగులు మోదీ తింటారని, అందుకే ఆయన చర్మం తెల్లగా నిగనిగలాడుతుందంటూ కూడా ఆయన మోదీని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment