Alpesh Thakor
-
బీజేపీ గూటికి అల్పేష్ ఠాకూర్
అహ్మదాబాద్ : గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వైదొలగిన అల్పేష్ ఠాకూర్ తన సహచరుడు, ఎమ్మెల్యే ధావల్ సింగ్ ఝలాతో కలిసి గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. గుజరాత్ బీజేపీ చీఫ్ జితూ వాఘానీ సమక్షంలో ఇరువురు నేతలు బీజేపీలో చేరారు. కాగా అల్పేష్ ఠాకూర్ నేతృత్వంలోని గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన (జీకేటీఎస్) ఠాకూర్ బీజేపీ గూటికి చేరతారని ఇప్పటికే వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అల్పేష్, ఝలా ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తమను అవమానించిందని, తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 2017లో అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరి రధన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఝలా అరవల్లి జిల్లా బయద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
టీనేజ్ అమ్మాయి మొబైల్ వాడితే జరిమానా..!
మెహసనా (గుజరాత్): పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో తమదైన నైపుణ్యంతో మహిళామణులు దూసుకెళ్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరికీ మొబైల్ లేనిదే పూట గడవదు..! అయితే, గుజరాత్‌లోని బనస్కాంత దంతివాడ ఠాకూర్ సంఘం మాత్రం భిన్న వాదన వినిపిస్తోంది. అమ్మాయిలకు కొత్త రూల్ విధించింది. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడొద్దని హుకుం జారీ చేసింది. మెహసనా జిల్లా జలోల్ గ్రామంలో ఠాకూర్ సంఘం ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి, గ్రామ ప్రజలంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం అవివాహితులైన అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదని తీర్మానించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. ఇందుకు శిక్షగా అమ్మాయి తండ్రి జరిమానాగా రూ.1.50 లక్షలు చెల్లించాలి. ఇవే కాకుండా.. వివాహ సమయాల్లో టపాసులు కాల్చడం, డీజే వాడటం వంటి అదనపు ఖర్చులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఏ అమ్మాయి అయినా కుటుంబం అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే అది నేరంగా పరిగణిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. ఠాకూర్ సంఘం నాయకుడు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ మాట్లాడుతూ... ‘వివాహాలలో ఖర్చులను తగ్గించడం వంటి కొన్ని నియమాలు బాగున్నాయి. టీనేజ్ అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు అనుమతించనట్లే, అబ్బాయిల గురించి కూడా ఒక నియమం చేసుంటే బాగుండేది. నా వివాహం కూడా ప్రేమ వివాహం అయినందున ప్రేమ వివాహాలపై నియమాల గురించి నేను ఏమీ చెప్పలేను. మన దేశ రాజ్యాంగ నిబంధనలు అందరికీ వర్తిస్తాయ’ని అన్నారు. -
పార్టీని వీడేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..
అహ్మదాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామాల బాటపడుతున్నారు. ఇక కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ప్రభుత్వాలను అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు కలవరపెడుతున్నాయి. మరోవైపు గుజరాత్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధఃగా ఉన్నారని ఆ పార్టీ మాజీ నేత, ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోందని, పార్టీ ఇదే పనితీరును కనబరిస్తే మరో పదేళ్లు పైగా అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్ధితి అనివార్యమని హెచ్చరించారు. సరైన నాయకుడు లేకపోవడంతో గుజరాత్లో పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, సగానికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక నాయకత్వ లక్షణాల్లో ప్రధాని మోదీతో రాహుల్ గాంధీని పోల్చలేమని, మోదీతో రాహుల్ సరితూగలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ టికెట్‌పై పటాన్ జిల్లా రతన్‌పూర్ నుంచి ఎన్నికైన అల్పేష్ ఠాకూర్ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. -
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి కీలక నేత
గాంధీనగర్: సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. అధికార బీజేపీని ఎదిరించి కొద్దికాలంలోనే సంచలనం సృష్టించిన యువనేత, ఓబీసీ ఉద్యమ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ కొంత కాలంగా సొంత పార్టీపైనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అధికార బీజేపీలో చేరతారని వార్తలు గుజరాత్లో బలంగా వినిపిస్తున్నాయి. ఠాకూర్ నాయకుల పట్ల కాంగ్రెస్ సరైన రీతిలో వ్యవహరించట్లేదని, తమకు తగిన ప్రాతినిథ్యం లభించట్లేదని అల్పేష్ తన అనుచరులతో వాపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యే కూడా పార్టీని వీడతారని తెలుస్తోంది. ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరున్న అల్పేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, పార్టీ గుజరాత్ యూనిట్ పనితీరు పట్ల తాను సంతోషంగా లేనని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి కూడా ఆ విషయం చెప్పానని, యువనేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పానని అన్నారు. తన విషయం తాను చెప్పుకోవడం లేదని, తనకు తగిన గుర్తింపే ఇచ్చారని చెప్పారు. ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన కొన్ని డిమాండ్లు తాను ప్రస్తావించినప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్ల మనస్తాపంతో ఉన్న మాట నిజమేనని చెప్పారు. అల్పేష్ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీకి బీ-టీమ్‌గా అల్పేష్ వ్యవహరిస్తున్నారని, ఠాకూర్ల డిమాండ్లంటూ ఆయన చేస్తున్న వాదన చూస్తే బీజేపీలో చేరే అవకాశాలే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను అల్పేష్ కాంగ్రెస్‌ను వీడుతారంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. -
రాజీనామా చేసిన 24 గంటల్లోపు మంత్రి పదవి!
అహ్మదాబాద్: విజయ్ రుపానీ ప్రభుత్వం శుక్రవారం గుజరాత్ కేబినెట్‌ను మరోసారి విస్తరిస్తూ.. ముగ్గురు మంత్రులను కొత్తగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నేత ఒకరికి ఈసారి అవకాశం కల్పించింది. మనవాదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జవహర్ చవ్దా పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోపు ఆయనను రూపానీ ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకోవడం గమనార్హం. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 2017లో బీజేపీలోకి ఫిరాయించిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధావల్ సిన్హా జడేజాకు కూడా రూపానీ సర్కారు అవకాశం కల్పించింది. మంజల్పూర్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత యోగేశ్ పటేల్‌కు కూడా మంత్రి అవకాశం కల్పించారు. తొమ్మిదినెలల్లో రూపానీ ప్రభుత్వం చేపట్టిన రెండో కేబినెట్ విస్తరణ ఇది. 2018 జూలైలో సీనియర్ నాయకుడు కున్వర్జీ బవలియాను కేబినెట్లోకి తీసుకుంది. ఆయన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి రూపానీతో కలుపుకొని గుజరాత్ కేబినెట్ మంత్రుల సంఖ్య 24కు చేరుకుంది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన అల్ఫేష్ ఠాకూర్ కూడా బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలకు ఆయన తాజాగా తెరదించారు. మంత్రిని కావాలని భావించిన మాట నిజమే కానీ, ఆ పదవితో తన సామాజికవర్గం సమస్యలను పరిష్కరించలేనని గుర్తించడంతో ఆ ఆలోచన మానుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
మోదీ శకంలో దూసుకొచ్చిన కొత్త తారలు!
2017... భారత రాజకీయ చరిత్రను కొత్త మలుపు తిప్పింది. భవిష్యత్ నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారంతా ఈ ఏడాది వెలుగులోకి వచ్చారు. మోదీ శకం దేదీప్యమానంగా సాగుతున్న సమయంలో.. కొత్త తారలు ఆవిర్భవించడం విశేషమే. ఈ ఏడాది భారత రాజకీయ యవనికపై కొత్త ముఖాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టే సత్తా ఉన్న నేతలెవరూ లేరా? అని అనుకుంటున్న తరుణంలో.. గుజరాత్ యువకులు ఆశాదీపంలా కనిపించారు. గుజరాత్ అంటే నాదే అని జబ్బలు చరుచుకునే మోదీకే ముగ్గురు ముప్పయి చెరువుల నీళ్లు తాగించారు. మోదీకి మొదటి అపజయ భయాన్ని కల్గించారు. ఇక దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. శతాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గుర్తింపు రానీ రాహుల్ గాంధీకి ఈ ఏడు బాగా కలిసి వచ్చింది. మిణుకుమిణుకు మంటున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తిరిగి వెలుగులు తీసుకురాగలడనే నమ్మకం ఇప్పుడే మొదలయింది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో రెండు దశాబ్దల కిందట అధికారానికి దూరమయిన భారతీయ జనతాపార్టీకి యోగి ఆదిత్యనాథ్ రూపంలో కొత్త శక్తి లభించింది. హార్ధిక్ పటేల్ పటేదార్ రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టిన హార్ధిక్ పటేల్.. రేపటి తరం రాజకీయ ప్రతినిధిగా గుజరాత్లో స్థానం సంపాదించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా సరిపోయేంత వయసులేని హార్ధిక్... ప్రధాని నరేంద్ర మోదీని ముప్పతిప్పలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి.. బీజేపీని ఓటమి అంచులవరకూ తీసుకు వచ్చారు. సౌరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు వచ్చాయంటే అది హార్ధిక్ పటేల్ సత్తానే అని చెప్పాలి. జిగ్నేష్ మేవాని సామాజిక వేత్తగా, న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న జిగ్నేష్ మేవానీ.. 2017 గుజరాత్ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారారు. ప్రధానంగా దళిత నేతగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని జిగ్నేష్ చేసిన విమర్శలు.. ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చిందని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ జిగ్నేష్.. వడ్గావ్ నియోజక వర్గం నుంచి 19 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. భవిష్యత్ గుజరాత్ నేతగా ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. అల్ఫేష్ ఠాకూర్ గుజరాత్లో ఓబీసీ నేతగా అల్ఫేష్ ఠాకూర్.. ఎదిగారు. ఈ ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో.. బీజేపీని, ప్రధాని మోదీ, అమిత్ షాల లక్ష్యంగా అల్ఫేష్ విమర్శల వర్షం కురిపించారు. గుజరాత్ క్షత్రియ ఠాకూర్ సేన పేరుతో.. ఆల్ఫేష్ ఠాకూర్ బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎన్నికల్లో.. అల్ఫేష్ ఠాకూర్.. బీజేపీ అభ్యర్థిపై 10 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యానాథ్.. మొన్నటి వరకూ గోరఖ్‌పూర్ మఠాధిపతిగా, గోరఖ్‌పూర్ లోక్‌సభ సభ్యుడిగానే అందరికీ తెలుసు. ఈ ఏడాది యూపీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అతివాద హిందూ నేతగా ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ తరువాత భారత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్ అని బీజేపీలో ఒక వర్గం ప్రచారం సైతం చేస్తోంది. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి 2004లోనే రాహుల్ గాంధీ ప్రవేశించినా తిరుగులేని గుర్తింపు మాత్రం ఈ ఏడాదే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. వారసత్వంగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడన్న వాదనలు ఉన్న సమయంలో గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ తొలిసారి తన సత్తాను చాటారు. కూటమి కట్టడంలోనూ, అందరినీ కలుపుకుపోవడంలోనూ, మోదీపై విమర్శలు చేయడంలోనూ రాహుల్ పరిణతి ప్రదర్శించారు. ‘నీచ్’ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌పై వేగంగా చర్యలు తీసుకుని.. తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. -
దళితుల ఆశాదీపం జిగ్నేష్ మేవానీ
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదురొడ్డి పోరాడిన ముగ్గురు యువకుల్లో జగ్నేష్ మేవానీ ఒకరు. దళితుడైన మెవానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేవలం 18 నెలల్లోనే ఎమ్మెల్యేగా బనస్కాంత జిల్లా వడ్గామ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతుల్లో అనాదిగా అణగారిపోతున్న తమ గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తారని దళితులు ఆశిస్తున్నారు. మేవానీని తమ ఆశాదీపంగా కొనియాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో యువ నాయకుడు అల్పేశ్ ఠాకూర్.. పటాన్ జిల్లా రాధాన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు అసెంబ్లీకి పోటీచేసే వయస్సు లేకపోవడం వల్ల బరిలోకి దిగలేదు. 2016, జూలై నెలలోనే మేవాని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఉనాలో ఓ చనిపోయిన ఆవు ఛర్మాన్ని వలుస్తుంటే నలుగురు దళిత యువకులపై అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడిచేసి దారుణంగా హింసించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన మేవాని, దళిత యువకులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకొని ‘ఉనా దళిత్ అత్యాచార్ లడత్’ సమితిని ఏర్పాటు చేశారు. లాయరైన మెవానీ కొంత కాలం జర్నలిస్ట్‌గా పనిచేసి ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మారారు. దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళుతున్నారు. నేడు రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతుడైన మేవానీ తప్పకుండా అసెంబ్లీ ముందుకు తీసుకెళతారనే విశ్వాసం తమకు పూర్తిగా ఉందని సురేంద్రనగర్ జిల్లా దళిత నాయకుడు నాథూభాయ్ పార్మర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేవాని విజయం ఇతర సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని, వారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత వ్యవస్థను మార్చేందుకు కృషి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉనా సంఘటన అనంతరం మేవానీ తమకు ఎంతో మేలు చేశారని ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు పాతికేళ్ల సర్వాయ చెప్పారు. మేవానీ నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్న ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఉనా సంఘటనపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేయలేదు. కేసులో నిందితులను అరెస్ట్‌చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మేవానీతోపాటు దసడ, దారిలింమ్డా, కోడినార్, కలవడ్, గధడ అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి కూడా దళితులు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. గత అసెంబ్లీలో కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులుగా ముగ్గురు దళితులు విజయం సాధించగా ఈసారి ఆరుగురు దళితులు విజయం సాధించడం విశేషం. అయితే మేవానీ రాజకీయాల్లో చేరకుండా సామాజిక కార్యకర్తల్లా దళితుల హక్కుల కోసం పోరాడితేనే బాగుండేదని కొంత మంది దళిత నాయకులు, ఘనశ్యామ్ షా లాంటి రాజకీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్‌కు ఉన్న ఆ రెండు ఆశలు బతికాయి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఆశలు బతికాయి. తొలిసారి తమ పార్టీ తరుపున, పార్టీ అండతో బరిలోకి దిగిన ఇద్దరు యువ నేతలు జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ తమ విజయాన్ని ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేష్ వాద్గాం స్థానం నుంచి బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఓబీసీల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టిన అల్పేష్ ఠాకూర్ తన విజయాన్ని ఖరారు చేసుకున్నారు. తొలుత వెనుకబడినట్లు కనిపించినా చివరకు రాధన్‌పూర్ నుంచి గెలుపొందారు. గుజరాత్లో ఇది కూడా ఒక అతిపెద్ద నియోజకవర్గం. గుజరాత్లో తీవ్ర స్థాయిలో పటేళ్ల ఉద్యమం జరిగినప్పుడు హార్ధిక్ పటేల్ వెంట ఈ ఇద్దరు ఉన్నారు. అయితే, హార్ధిక్ ప్రస్తుత వయసు 24 ఏళ్లు కావడంతో అతను ప్రచారం మాత్రమే నిర్వహించాడు. జిగ్నేష్ దళిత నేత కాగా అల్పేష్ ఠాకూర్ మాత్రం ఓబీసీల ప్రతినిధి. ఇక జిగ్నేష్‌పై బీజేపీ బరిలోకి దింపిన లావింగ్జి ఠాకూర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తే అయినప్పటికీ అతడు అనూహ్యంగా బీజేపీలో వెళ్లి ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ మద్దతుతోనే బరిలోకి దిగిన ఈ ఇద్దరు నేతలు ప్రచారంలో కూడా బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చారు. ఇక అల్పేష్ ఠాకూర్ అయితే ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపించారు. లక్షల రూపాయల విలువ చేసే పుట్టగొడుగులు మోదీ తింటారని, అందుకే ఆయన చర్మం తెల్లగా నిగనిగలాడుతుందంటూ కూడా ఆయన మోదీని విమర్శించారు. -
కాంగ్రెస్ నేతకు తైవాన్ మహిళ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ఓట్ల కోసం కాంగ్రెస్ యువనేత అల్పేశ్ ఠాకూర్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ భోజనం ఖర్చు రోజులకు రూ.4 లక్షలంటూ పఠాన్ జిల్లాలోని రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తైవాన్ మహిళ మెస్సీ జో స్పష్టం చేశారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తైవాన్ నుంచి తెప్పించిన స్పెషల్ పుట్టగొడుగులు (మష్రూమ్స్) మోదీ తింటారని, వాటివల్లే ఆయన అందంగా, ఆరోగ్యంగా ఉంటారన్నది అవాస్తవమని చెప్పారు. అల్పేశ్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, అందుకు నిదర్శనంగా తైవాన్ మహిళ పలు విషయాలను వెల్లడించిన వీడియోను ప్రమోద్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. తైవాన్ మహిళ ఏమన్నారంటే.. భారత మీడియాలో తైవాన్ పుట్టగొడుగుల గురించి వార్త చదివాను. భారత ప్రధాని మోదీ తైవాన్ మష్రూమ్స్ తినడం వల్లే అందంగా, ఆకర్షణీయంగా తయారయ్యారని కథనాలు చూశాను. కానీ ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. మా దేశం (తైవాన్)లో అలాంటి మష్రూమ్స్ లేవు. అసలు వాటి గురించి ఎప్పుడూ వినలేదు. రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ వీడియో ద్వారా మెస్సీ జో వెల్లడించారు. దీంతో ఓట్ల కోసమే కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ మంగళవారం స్థానికంగా నిర్వహించిన ఒక సభలో మాట్లాడుతూ.. 'ప్రధాని మోదీగారు తినేది సాధారణ భోజనం కాదు. తైవాన్ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారు. రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు ఐదు తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలు. భారీ స్థాయిలో తన ఆహారానికి మోదీ ఖర్చు చేస్తున్నారంటూ' తీవ్ర ఆరోపణలు చేశారు. Here is a stinging response from a Taiwanese woman to #AlpeshThakor 's blatant lie that one can get fairer by consuming Taiwanese mushroom. pic.twitter.com/kBrxjXOOyQ — Pramod Kumar Singh (@SinghPramod2784) 12 December 2017 -
కాంగ్రెస్ నేతకు తైవాన్ మహిళ షాక్..
-
మోదీ భోజనం ఖర్చు రోజుకు రూ.4 లక్షలు!!
అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల రెండో దశ పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయ ఆరోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌తో కుమ్మక్కైందన్న ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ యువనేత అల్పేశ్ ఠాకూర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అవికాస్తా అభ్యంతరకరంగా ఉండటంతో బూమరాంగ్ అయ్యాయి. మోదీ భోజనం ఖర్చు ఎంతో తెలుసా? పఠాన్ జిల్లాలోని రాధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న అల్పేశ్ ఠాకూర్.. మంగళవారం స్థానికంగా నిర్వహించిన ఒక సభలో మాట్లాడుతూ మోదీ భోజనం ఖర్చులపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘మన ప్రధాని మోదీగారు తినేది అలాంటి ఇలాంటి భోజనం కాదు.. తైవాన్ నుంచి తెప్పించే పుట్టగొడుగులు(మష్రూమ్స్) తింటారాయన! ఒక్కోటి రూ.80 వేలు ఖరీదైన మష్రూమ్స్ రోజుకు ఐదు తింటారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలన్నమాట! ఇక ప్రధానిగారే అంత తింటుంటే.. సాధారణ బీజేపీ కార్యకర్తలు ఎలా ఉంటారో ఊహించుకోవచ్చు’’ అని అల్పేశ్ అన్నారు. ఒకప్పుడు నల్లగా ఉండే మోదీ ఇప్పుడు టమాటాలా ఉన్నారు! భోజనం ఖర్చు ఆరోపణలతోపాటు అల్పేశ్ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకప్పుడు మోదీ.. నా(అల్పేశ్) మాదిరిగానే నల్లగా ఉండేవారు. కానీ ఇప్పుడాయన నిగనిగలాడే టమాటా పండులా తయారయ్యారు. మష్రూమ్స్ తినడం వల్లే ఆయన ఒంటికి రంగుపట్టింది. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన మష్రూమ్స్ తినడం మొదలుపెట్టారని తెలిసింది’’ అని అల్పేశ్ అన్నారు. కాగా, మోదీని ‘నల్ల’మనిషి అనడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శరీరం రంగును తక్కువచేసి మాట్లాడటం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
మోదీ భోజనం ఖర్చు ఎంతో తెలుసా?