
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరుతో దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనుగడ ప్రమాదంలో పడ్డాయని ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మేవానీ ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి నిరాకరించినప్పటికీ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో మంగళవారం జరిగిన ‘యువ హూంకార్ ర్యాలీ’లో మేవానీ మాట్లాడారు. తమ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించటం గుజరాత్ తరహా రాజకీయాలకు నిదర్శనమన్నారు. భీమ్ ఆర్మీ ఫౌండర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన్ను ఇంతకాలం జైలులో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. భీమా–కోరేగావ్ ఘటన ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ నేత రోహిత్ వేముల హత్యపై పోరాటం సాగిస్తామని, ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ‘యువ హూంకార్’ సభకు జనం రెండువేల మంది రాగా, పోలీసులు మాత్రం బందోబస్తుకు 15వేల మంది బలగాలను వినియోగించి ఉంటారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment