
బొమ్మనహళ్లి: ప్రధాని మోదీ పాల్గొనే కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం దళిత సంఘాలు నిర్వహించిన సమావేశంలో మేవానీ మాట్లాడారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. లక్షలాది మందిని నిరుద్యోగులుగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తే ఈ విషయంపై కుర్చీలు విసిరి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేయడం చూస్తుంటే దళితులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment