chairs thrown
-
సినిమా హాల్లో వీరంగం
విజయవాడ, ప్రత్తిపాడు : యువకులు మద్యం సేవించి సినిమా హాల్లో వీరంగం సృష్టించిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకుపల్లి మండలం బొలుసుపాలెంకు చెందిన షేక్ సంధాని, షేక్ ఇలియాస్, గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన వసీం అక్రమ్ గురువారం రాత్రి గుంటూరులోని ఓ శుభకార్యానికి వచ్చారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం ప్రత్తిపాడులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. రాత్రి పూటుగా మద్యం సేవించి స్థానిక మారుతి థియేటర్లో సెకండ్ షో సినిమాకు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత థియేటర్ లోపల నుంచి భారీ శబ్ధం రావడంతో టిక్కెట్లు ఇచ్చే చేపర్తి వెంకటశివ లోపలకు వెళ్లి గమనించాడు. కుర్చీలు విరగ్గొట్టి ఉండటంతో ఇదేమని యువకులను మందలించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరలా కొద్ది సమయం తరువాత సినిమా హాల్‌కు వచ్చిన యువకులు నానా హంగామా సృష్టించారు. థియేటర్లోని లైట్లు పగులగొట్టడంతో పాటు 25 కుర్చీలు విరగ్గొట్టి, తెరను చింపేశారు. అడ్డు వచ్చిన టిక్కెట్లు ఇచ్చే చేపర్తి శ్రీనివాసరావుతో పాటు హాల్ సిబ్బంది, మరికొందరిపై కుర్చీలతో దాడి చేశారు. శ్రీనివాసరావు తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. -
మోదీ సభలో కుర్చీలు విసరండి: జిగ్నేశ్
బొమ్మనహళ్లి: ప్రధాని మోదీ పాల్గొనే కర్ణాటక ఎన్నికల ప్రచార సభల్లో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని దళిత ఉద్యమ నేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం దళిత సంఘాలు నిర్వహించిన సమావేశంలో మేవానీ మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. లక్షలాది మందిని నిరుద్యోగులుగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తే ఈ విషయంపై కుర్చీలు విసిరి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేయడం చూస్తుంటే దళితులను అణచివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. -
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
-
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి 'బలం' ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు .. స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు. ఆయన టేబుల్ కూడా విరగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఆయన మీదకు ముందుగా కాగితాలు విసిరేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో... డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. అంతలో స్పీకర్ తీరుకు నిరసనగా.. డీఎంకే ఎమ్మెల్యే కు కా సెల్వం నేరుగా వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు.