అమ్మాయితో అఫైర్‌ పెట్టుకున్నాడనీ.. | Duo Ties Dalit Teen to Tree And Thrashes Him | Sakshi
Sakshi News home page

అమ్మాయితో అఫైర్‌ పెట్టుకున్నాడనీ..

Published Sat, Mar 23 2019 10:03 AM | Last Updated on Sat, Mar 23 2019 10:03 AM

Duo Ties Dalit Teen to Tree And Thrashes Him - Sakshi

అహ్మదాబాద్‌ : అగ్రకుల అమ్మాయితో అఫైర్‌ పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ టీనేజ్‌ కుర్రాడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. గుజరాత్‌,మెహసాన పట్టణ సమీపంలోని దినోజ్‌ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు.. 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఇంగ్లీష్‌ పరీక్ష రాయడానికి స్కూల్‌ ముందు వేచిఉండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. శరీరంపై గాయాలు చూసిన బాధితుడి తల్లి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘పరీక్ష ఉంది వదలిపెట్టండన్నా.. అని వేడుకున్న విడిచిపెట్టలేదని బాధితుడు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు.

తనను తీసుకెళ్లిన వారిలో ఒకరిని గుర్తుపట్టానని, అతను గుజరాత్‌ ఆర్టీసీ కండక్టర్‌ రమేష్‌ పటేలని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేయకపోతే బంద్‌కు పిలుపునిచ్చి, ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ దాడితో బాధితుడు ఒక్క ఇంగ్లీష్‌ పరీక్షనే కాకుండా మరో ఎగ్జామ్‌ కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది మేవానీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement