Mehsana district
-
అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనీ..
అహ్మదాబాద్ : అగ్రకుల అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ టీనేజ్ కుర్రాడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. గుజరాత్,మెహసాన పట్టణ సమీపంలోని దినోజ్ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు.. 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి స్కూల్ ముందు వేచిఉండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. శరీరంపై గాయాలు చూసిన బాధితుడి తల్లి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘పరీక్ష ఉంది వదలిపెట్టండన్నా.. అని వేడుకున్న విడిచిపెట్టలేదని బాధితుడు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను తీసుకెళ్లిన వారిలో ఒకరిని గుర్తుపట్టానని, అతను గుజరాత్ ఆర్టీసీ కండక్టర్ రమేష్ పటేలని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బంద్కు పిలుపునిచ్చి, ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ దాడితో బాధితుడు ఒక్క ఇంగ్లీష్ పరీక్షనే కాకుండా మరో ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది మేవానీ తెలిపారు. -
ప్రధాని మోదీ ఇలాకాలో బీజేపీకి షాక్
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. గత అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి ఈ సారి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సనాలో జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోగా, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. గుజరాత్లో వరుస ఓటములతో ఢీలాపడ్డ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పుంజుకుంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 వాటిలో గెలిచినట్టు కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ 30 జిల్లా పరిషత్ లను గెలవడం గమనార్హం. ఇక 4800 బ్లాక్, పంచాయతీ సమితిలలో 2200 వాటిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు సింఘ్వి చెప్పారు. గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ సొంత తాలుకాలో కాంగ్రెస్ విజయం సాధించినట్టు తెలిపారు. కాగా ఆ రాష్ట్రంలోని మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ దక్కించుకుంది. మున్సిపాల్టిల్లోనూ బీజేపీ హవా కొనసాగుతున్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్లో పటేళ్లు ఆందోళన బాటపట్టడం, అధికార బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండటంతో.. గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓటమి ఎదురైందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రేపిస్ట్ భార్యపై లాయర్ లైంగిక దాడి
అహ్మదాబాద్: తన భర్త తరపున వాదించిన న్యాయవాది లైంగిక దాడికి పాల్పడ్డాడని గుజరాత్ లో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి భర్తకు 2009లో ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. తన భర్త తరపున వాదించిన న్యాయవాది జిగ్నేష్ మెవాడా గత మూడేళ్లలో పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు మెహ్సనా జిల్లాలోని కాది తాలుకా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భర్తను జైలు నుంచి తీసుకొస్తానని చెప్పి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడించింది. నిందితుడు గాంధీనగర్ జిల్లా కోర్టులో లాయర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.