Dalit teenager
-
అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనీ..
అహ్మదాబాద్ : అగ్రకుల అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ టీనేజ్ కుర్రాడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. గుజరాత్,మెహసాన పట్టణ సమీపంలోని దినోజ్ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు.. 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి స్కూల్ ముందు వేచిఉండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. శరీరంపై గాయాలు చూసిన బాధితుడి తల్లి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘పరీక్ష ఉంది వదలిపెట్టండన్నా.. అని వేడుకున్న విడిచిపెట్టలేదని బాధితుడు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను తీసుకెళ్లిన వారిలో ఒకరిని గుర్తుపట్టానని, అతను గుజరాత్ ఆర్టీసీ కండక్టర్ రమేష్ పటేలని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ ఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బంద్కు పిలుపునిచ్చి, ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ దాడితో బాధితుడు ఒక్క ఇంగ్లీష్ పరీక్షనే కాకుండా మరో ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది మేవానీ తెలిపారు. -
చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి..
ఆగ్రా: ఓ గేదెను దొంగిలించాడనే అనుమానంతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ అనే గ్రామంలో చోటుచేసుకుంది.తమ గేదెను దొంగిలించారనే అనుమానంతో ఓ 15మంది అగ్రకులస్తులు ఈ పనిచేసినట్లు బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు. 'మా కొడుకు గేదెను దొంగిలించాడనే అనుమానంతో ఇంటికొచ్చిన 15మంది పెద్ద కులపోల్లు ఇంట్లో ఉన్న నా కొడుకును ఈడ్చుకెళ్లారు. మా వాడు ఆ దొంగతనం చేయలేదు. అయినా, మా కొడుకును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా బట్టలు విప్పేసి దారుణంగా హింసించారు. వాడి మార్మాంగాలపై పెట్రోల్ పోయడమే కాకుండా మత్తు సూదులు కూడా వేశారు' అంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి..
ఉత్తరప్రదేశ్లోని దబౌలి గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. భూవివాదంలో పోలీసులకు ఫిర్యాదుచేశారనే అక్కసుతో ఓ దళిత బాలుడిని దారుణంగా అవమానించారు. అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడనే ఆగ్రహంతో అతడికి గుండుకొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా తిప్పారు. స్థానిక ఇటుకబట్టీ యజమాని, మరో ఇద్దరు ఉద్యోగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే ఇటుకబట్టీ నిర్వహించే స్థలానికి పక్కనే ఉన్న బాధితుల పూర్వీకుల భూమిని కబ్జా చేయడానికి వీరేంద్ర ప్రయత్నించడంతో వివాదం రాజుకుంది. తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాడంటూ దళిత బాలుని తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సదరు యజమాని ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీ యజమాని వీరేంద్ర కుమార్ మిశ్రాతో పాటు మిగిలిన ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీస్ అధికారి తెలిపారు.