![Jignesh Mevani attacks PM Narendra Modi - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/4/Jignesh%20Mevani.jpg.webp?itok=CnjGX3EA)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గుజరాత్ దళిత ఉద్యమనేత జిగ్నేష్ మేవాని ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. దళితులపై ప్రధాని కపట ప్రేమను కనబరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దళితులపై దాడులను గురించి ప్రధాని మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత్ నుంచి ప్రపంచ మహానటుడు వస్తాడన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ అంచనాలు నిజమయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన దళిత హక్కుల గురించి మోదీ ప్రసంగాల్లో చెప్పిన అంశాలను పోస్ట్ చేశారు. దళితులు హక్కులు గురించి మాట్లాడేవారంతా.. మహారాష్ట్రలో మాత్రం రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిచారని అన్నారు. ‘మీరు కాల్చాంటే నన్ను కాల్చండి. దళిత సోదరులను కాదు’ అంటూ ఆగస్టులో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. దళితులపై గోరక్షకుల దాడులపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వద్గామ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేవాని విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment