Best Actor
-
నాకు అవార్డు రావడానికి కారణం ఆయనే: బన్నీ ట్వీట్ వైరల్
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయనకు జాతీయ అవార్డు రావడం పట్ల ట్వీట్ చేశారు. నా ఈ విజయానికి కారణం ఆయనేనంటూ పోస్ట్ చేశారు. బన్నీ తన ట్వీట్లో రాస్తూ..'జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. మన సినిమాను ఆదరించిన వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా సుకుమార్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా విజయానికి కారణం ఆయనే.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఎర్రచందనం నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy — Allu Arjun (@alluarjun) October 17, 2023 -
టాప్ వన్‌లో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరంటే..?
వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనేది టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ సంస్ధ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. 2023 జూన్ నెలకు సంబంధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నారు. తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. మూడో స్థానంలో ప్రభాస్ ఉన్నారు. (ఇదీ చదవండి: అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్‌ను గెలికిన కంగనా) అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత నెలతో చూస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ స్థానాలలో నిలిచారు. తర్వాత అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7)లో ఉన్నారు. గత నెలలో 6వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ఈసారి 8వ నంబర్‌తోనే సరిపెట్టుకున్నారు. అక్షయ్ కుమార్ (9), మహేష్ బాబు (10) స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే మహేష్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. గత నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్‌కు జూన్ నెలలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. టాప్ పొజీషన్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత ఉన్నారు. తర్వాత రోండో స్థానంలో అలియా భట్ ఉన్నారు. తర్వాత దీపికా పదుకొనే, నయనతార కాజల్ అగర్వాల్, త్రిష, కత్రినా కైఫ్, కైరా అద్వానీ, కీర్తి సురేశ్, రష్మిక మందన్నా వరుసుగా టాప్ టెన్‌లో ఉన్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2023) #OrmaxSIL pic.twitter.com/I0e35kOGBm — Ormax Media (@OrmaxMedia) July 21, 2023 -
‘బలగం’కి మరో రెండు అవార్డులు
ఓ కుటుంబ పెద్ద చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల భావోద్వేగం, అనుబంధాలతో సాగే ‘బలగం’కి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. తాజాగా ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. -
ఆస్కార్ రేసులో ఎన్టీఆర్.. జాబితాను వెల్లడించిన ప్రముఖ మ్యాగజైన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను మెచ్చుకోని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. యాక్షన్ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్ పరంగానూ తారక్ నటన కంటతడి పెట్టింటింది. ఆస్కార్ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్ నిలుస్తారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది టాప్-10 బెస్ట్ యాక్టర్స్ ప్రిడిక్షన్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం దక్కడం విశేషం. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ తదితరుల పేర్లు కూడా టాప్-10 లిస్ట్‌లో ఉన్నాయి. ఇక ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ నామినేషన్స్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏదో ఒక విభాగంలో అయినా ఆస్కార్ దక్కుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొమురం భీమ్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఆస్కార్ వరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. -
విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా?
ఆస్కార్స్ 2022 ఈవెంట్ వేదికగా జరిగిన షాకింగ్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటుడు విల్ స్మిత్, మరో నటుడు క్రిస్ రాక్‌ను స్టేజ్‌పైనే ముఖం పగల కొట్టిన ఘటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విల్ స్మిత్‌కు దక్కిన బెస్ట్ యాక్టర్ అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఇన్సిడెంట్ ఈవెంట్ లైవ్‌లో టెలికాస్ట్ కాలేదు. పైగా ఈ ఘటన తర్వాత ఆస్కార్స్ 2022 ఈవెంట్‌ను కాసేపు నిలిపేసినట్లు సమాచారం. అయితే కాసేపటికే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఈవెంట్ వేదికగానే విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ ట్రోఫీ అందుకున్నారు.. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అకాడమీ రూల్స్ ప్రకారం.. విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)’’ అంటూ ట్వీట్ చేసింది అకాడమీ. The Academy does not condone violence of any form. Tonight we are delighted to celebrate our 94th Academy Awards winners, who deserve this moment of recognition from their peers and movie lovers around the world. — The Academy (@TheAcademy) March 28, 2022 ఇక ఇలాంటి సందర్భాల్లో అకాడమీ గట్టి చర్యలు తీసుకోవాలని, సరైన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని, అసలు ఈ ఉదంతాన్ని ఒక దాడిగా పరిగణించి విల్ స్మిత్ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అకాడమీ మాత్రం అవార్డు వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయలేదు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 అకాడమీ రూల్స్ ఏం చెబుతోందంటే.. 2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్ కోడ్.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు అవతలి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అంతేకాదు.. అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు కూడా. అయితే విల్ స్మిత్ దాడి విషయంలో.. స్టేజ్ మీద ఉన్న క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. ఆమె చూడడానికి జీఐ జేన్ 2(సినిమా.. అందులో లీడ్ రోల్) లాగా ఉందంటూ కామెంట్ చేశాడు. కానీ, జాడా అలోపెషియాతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం వల్లే ఆమె జుట్టు రాలిపోగా.. అలా గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. అందుకే భార్య మీద వేసిన జోక్‌కు విల్ స్మిత్‌కు మండిపోయి గూబ పగలకొట్టి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. విల్ స్మిత్, జాడా పింకెట్లు 1997లో వివాహం చేసుకున్నారు. 2018లో జాడా తనకు ఉన్న అలోపెసియా గురించి ఓపెన్ అయ్యింది. తద్వారా గొంతు సమస్యలు, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. -
‘వాళ్లు..నా వాళ్లు..ఇది చరిత్ర’ : ఐశ్వర్య
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు. అందుకే రజనీకాంత్ కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసు కుంటోంది. ‘‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ధనుష్ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
సినిమాలో రాణి మిస్సయింది.. కానీ
సినిమాలో రాణి మిస్సయ్యింది కానీ నిజ జీవితంలో మాత్ర రాణి తనకే దక్కిందంటున్నారు బాలీవుడ్ ‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ రణ్వీర్ సింగ్. ‘స్టార్ ప్లస్’ వారు నిర్వహించిన స్టార్ స్క్రీన్ అవార్టుల కార్యక్రమంలో ‘పద్మావతి’ చిత్రంలో చేసిన ఖిల్జీ పాత్రకు గాను ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు రణ్వీర్ సింగ్. పెళ్లైన తరువాత అందుకున్న తొలి అవార్డ్ కావడంతో కాస్తంతా ఉద్వేగానికి గురయ్యారు రణ్వీర్. అంతేకాక ఈ అవార్డ్‌ను తన భార్య దీపికకు అంకితమిచ్చారు రణ్వీర్ సింగ్. ఈ సందర్భంగా రణ్వీర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాకు రాణి లభించలేదు.. కానీ నిజ జీవితంలో రాణి దొరికింది. బేబీ థాంక్యూ.. ఈ ఆరేళ్లలో నేను ఎన్నో సాధించాను.. ఎందకంటే నువ్వు ఎల్లపుడు నాతోనే ఉన్నావు కాబట్టి. ధన్యవాదాలు’ అంటూ వేదిక మీద భార్యను పొగడ్తలతో ముంచెత్తారు. View this post on Instagram " BABY I LOVE YOU "😍😍😍,,Yasssss we know 😭😭😭😭Ranveer's speech in #starscreenawards 🖤 . Look at @vickykaushal09 😭😭 . #deepveer #deepveeraddict #mrandmrsbhavnani #starscreenawards #couplegoals #cutest😍😍 @deepveer_addict_ 🖤 A post shared by #DeepVeer ❤❤ (@deepveer_addict_) on Dec 16, 2018 at 10:16am PST -
మా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ తనే
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు యాక్టర్స్ ఉన్నారు. జయ బచ్చన్, అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్. అందరు మంచి ఆర్టిస్ట్‌లే. మీ ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ ఎవరు? అంటే శ్వేతా అంటున్నారు అమితాబ్. శ్వేత అమితాబ్ కుమార్తె. రీసెంట్గా ఓ టీవి యాడ్ కోసం తండ్రి అమితాబ్‌తో కలిసి ఫస్ట్ టైమ్ కెమెరాను ఫేస్ చేశారు శ్వేత బచ్చన్. ఆ యాడ్ షూట్ తర్వాత శ్వేత యాక్టింగ్ స్కిల్స్ గురించి అమితాబ్ మాట్లాడుతూ– ‘‘శ్వేతా కెమెరాముందు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ తనే. ఒకవేళ తన ముందు ఈ మాట అన్నా తను ఒప్పుకోకపోవచ్చు. తనలో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉంది. మా ఫ్యామిలీ గెట్టుగెదర్ అప్పుడు మా అందర్నీ ఎగ్జాట్‌గా ఇమిటేట్ చేస్తుంది’’ అని పేరొన్నారు. -
'అవార్డును ఇంటికి పంపించండి'
ముంబై: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం ముంబైలో శనివారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్నట్లు ప్రముఖ మ్యాగజైన్ ' ఫెమినా' తన ట్విటర్ట్ అకౌంట్లో పేర్కొంది. ఇంతకీ ఉత్తమ నటుడి అవార్డును ఇర్పాన్ ఖాన్ దక్కించుకుంటే ఇర్పాన్ పఠాన్ పేరును ప్రచురించారు.. అయితే పొరపాటున ఇర్ఫాన్ పఠాన్ పేరును సదరు మ్యాగ్జైన్ కోడ్ చేయడం ట్విట్టర్లో జోకుల వర్షం కురిసింది. కాగా, దీనిపై ఇర్పాన్ పఠాన్ తనదైన శైలిలో స్పందించాడు. ' నాకు అవార్డు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నేను అవార్డు అందుకోవడానికి రాలేను. నా అవార్డును ఇంటికి పంపించండి' అని పఠాన్ సరదాగా బదులిచ్చాడు. Thank u n sorry I couldn’t make it but u can send the award to me at my home ;);) — Irfan Pathan (@IrfanPathan) 21 January 2018 -
‘ఆయన.. ఈ శతాబ్దపు అత్యుత్తమ నటుడు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గుజరాత్ దళిత ఉద్యమనేత జిగ్నేష్ మేవాని ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. దళితులపై ప్రధాని కపట ప్రేమను కనబరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో దళితులపై దాడులను గురించి ప్రధాని మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో భారత్ నుంచి ప్రపంచ మహానటుడు వస్తాడన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ అంచనాలు నిజమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన దళిత హక్కుల గురించి మోదీ ప్రసంగాల్లో చెప్పిన అంశాలను పోస్ట్ చేశారు. దళితులు హక్కులు గురించి మాట్లాడేవారంతా.. మహారాష్ట్రలో మాత్రం రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిచారని అన్నారు. ‘మీరు కాల్చాంటే నన్ను కాల్చండి. దళిత సోదరులను కాదు’ అంటూ ఆగస్టులో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. దళితులపై గోరక్షకుల దాడులపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వద్గామ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేవాని విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అభినయ ఖిల్లా ‘జబీవుల్లా’
గుంతకల్లు: అభినయంలో అందెవేసిన చేయి రిటైడ్ రైల్వే ఉద్యోగి జబీవుల్లా. జబీవుల్లా నటనకు ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందాల్సిందే. తను స్టేజీపైకెక్కితే చాలు.. అవార్డుల తన చెంతకు రావాల్సిందే. ఎన్నో నాటకాల్లో ఇప్పటిదాకా ఏకంగా 50కి పైగా అవార్డులు, ప్రశంసా పత్రాలు, షీల్డులు దక్కించుకున్నారు. తాజాగా 2017కు అనంతపురం జిల్లా స్థాయి బళ్లారి రాఘవ అవార్డు ఎంపిక కావడం గమనార్హం. ఆగస్టు 3న బళ్లారి రాఘవ అవార్డును ఆయనకు అందజేయనున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో కేంద్ర కార్యాలయంలో క్రాప్ట్మెన్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్)గా పని చేస్తూ మూడేళ్ల క్రితం ఉద్యోగవిరమణ చేసిన జబీవుల్లా పూర్తి పేరు మహమ్మద్ ఇస్మాయిల్ జబీవుల్లా. మద్రాస్ సదరన్ మరాఠా రైల్వేస్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించిన సయ్యద్ జబీవుల్లా బషీరున్నీషా దంపతులకు రెండవ సంతానంగా 1954 ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడులోని అరక్కోణంలో జన్మించాడు. జబీవుల్లా తండ్రి ఉద్యోగ రిత్యా ఆంధ్రాకు వచ్చి స్థిరపడ్డాడు. 1970లో రెండవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా కడప జిల్లా నందలూరులో విశ్వాత్తాపం అనే నాటకంలో ప్రతి నాయకుడి పాత్రను పోషించి నాటక జీవితాన్ని అరంభించాడు. ఈ నాటకంలో ఇతర నటనకు ఉత్తమ విలన్‌గా అవార్డు వచ్చింది. 1971లో గుంతకల్లులో చంద్రయ్య అనే నటుడు నిర్వహిస్తున్న రవీంద్ర ఆర్ట్స్‌లో చేరి ఉత్తమ కళాకారులుగా రాణించిన సీపీ రామ్మూర్తి, కోటేశ్వరరావు ఆనంద్, పంజా ప్రసాద్‌రావు సహకారంతో అనేక నాటకాల్లో నటించారు. ముఖ్యంగా ప్రఖ్యాత హాస్యనటుడు దివంగత గురుమూర్తి వద్ద హాస్యం నుంచి ట్రాజడీకి వెళ్లే కళను నేర్చుకున్నాడు. ఇక నాటి నుంచి అనేక హృదయ విదారక సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగిగా రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణీకుల రక్షణపై, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాలతో జరిగే నష్టాలు తదితర అంశాలపై అనేక నాటకాలు రచించడంతో పాటు ఏక పాత్రాభినయాలు చేసి అధికారులను మెప్పించారు. 2000లో రైలు మార్గాలపై ఉండే మనిషి కాపలా ఉండని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలపై డాక్యుమెంటరీ చిత్రానికి అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్పందించి ఉత్తమ నటుడిగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చాలా అనందంగా ఉంది బళ్లారి రాఘవ అవార్డు(2017)కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాటకాల్లో అభినయించడం వల్ల జీవితం ఎంతో హాయిగా గడపడంతో పాటు మంచి నడవడిక అలవడింది. – జబీవుల్లా, రిటైడ్ రైల్వే ఉద్యోగి -
23 ఏళ్ల తర్వాత డ్రీమ్ నెరవేరింది!
లాస్ ఏంజిల్స్: 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. ఐదు నామినేషన్లు. అయినా అందకుండా ఊరిస్తున్న ఆస్కార్. ఎట్టకేలకు 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో కల నెరవేరింది. థ్రిల్లర్ డ్రామా 'ద రెవెనంట్' సినిమాలో చూపిన తన నటవిశ్వరూపానికిగాను డికాప్రియో ఉత్తమ నటుడిగా ఆస్కార్ ట్రోపీని అందుకున్నాడు. 'రెవెనంట్' సినిమాలో పగ తీర్చుకునే ఫర్ ట్రాపర్ పాత్రలో అసాధారణ అభినయాన్ని చూపిన డికాప్రియో అకాడమీ పురస్కారాన్ని అందుకొని భావోద్వేగంతో ప్రసంగించాడు. సినిమా దర్శకుడు ఇనారితు, సహ నటుడు టామ్ హార్డీతోపాటు చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రకృతి ప్రేమికుడైన డిక్రాపియో ఈ సందర్భంగా పర్యావరణ అంశాన్ని ప్రస్తావించాడు. 'సహజమైన ప్రపంచంతో మనిషి అనుబంధాన్ని మా 'రెవెనంట్' సినిమా చాటింది. వాతావరణం మారుతున్న సంగతి వాస్తవం. ఇది ప్రస్తుతం జరుగుతోంది. మన భూగోళంపై ప్రభావం చూపుతోంది. యావత్ జీవకోటి ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పు ఇది. దీనిని అడ్డుకునేందుకు మనం అందరం కృషి చేయాల్సిన అవసరముంది' అని డికాప్రియో పేర్కొన్నాడు. డికాప్రియో 'రెవెనంట్' సినిమా బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తన ఖాతాలో వేసుకున్నా.. అనూహ్యంగా 'స్పాట్ లైట్' సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ను ఎగరేసుకుపోవడం గమనార్హం. -
ఆనందం అంబరమైతే...
ఈసారి ఆస్కార్ నీదే అన్నారు! - ఉత్తమ నటి జూలియన్ మూర్ (స్టిల్ఎలైస్) ‘‘నేను శ్రమను నమ్ముతాను. అలాగే, నిజమైన అనుబంధాలను, నిజాయతీ గల వ్యక్తులను, మంచి కుటుంబాలను నమ్ముతాను. ఇవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే చేశాను. వాస్తవానికి ఈ చిత్రం చేస్తున్నప్పుడు నా భర్తకు చెప్పలేదు. ఏకంగా సినిమా చూపిద్దామనుకున్నా. ఇద్దరం కలిసి ప్రివ్యూ చూశాం. సినిమా చూసి, బయటికొస్తున్నప్పుడు ‘ఈ ఏడాది ఆస్కార్ నీదే’ అన్నారు. ఈ తరహా చిత్రాలు విజయం సాధించడానికి కారణం.. ప్రేక్షకులు తమను తాము ఆ పాత్రల్లో ఊహించుకోవడంవల్లే’’ అంటూ ఓ విధమైన ఉద్వేగానికి గురవుతూ అన్నారు. ఇదో అద్భుతమైన కల.. ఇప్పట్లో మేలుకోలేను! - ఉత్తమ నటుడు ఎడ్డీ రెడ్మెయిన్ (ది థీరీ ఆఫ్ ఎవ్రీ థింగ్) ఈ కథ వినగానే శారీరకంగా, మానసికంగా నా పాత్రలో ఒదిగిపోవాలనుకున్నా. దాని ఫలితమే ఈ ఆస్కార్. వేదికపై నటి కేట్ బ్లాంచెట్ నోటి నుంచి నా పేరు వినగానే, అడుగులు తడబడ్డాయి. ఆ తడబాటుని కప్పి పుచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఈ బంగారు బొమ్మను అందుకోవడం అనేది ఓ అద్భుతమైన కలలా ఉంది. ఇప్పట్లో ఈ కల నుంచి మేలుకోలేను. మేలుకున్న తర్వాత ఇది కల కాదు.. నిజమే అని నమ్ముతాను. కొన్ని భయాలు విజయాలను ఆస్వాదించనివ్వవు - ఉత్తమ దర్శకుడు అలెగ్జాండ్రో జి. ఇనారిట్ (బర్డ్ మ్యాన్) అసలీ చిత్రాన్ని ఎందుకు తీశానో? ఎలా తీశానో? బంగారంలాంటి ఈ అవకాశం ఎందుకొచ్చిందో నేను చెప్పలేను. కొన్ని భయాలు.. విజయాలను ఆస్వాదించనివ్వవు. ప్రస్తుతం నేనా పరిస్థితిలో ఉన్నాను. కానీ, సినిమా చేసేటప్పుడు భయపడలేదు. అందుకే ఈ విజయం. అయినా ఆనందపడటంలేదు. నా జీవితంలో నేనెవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే అది మా అమ్మగారికే. నా జీవిత ప్రయాణం ఇందాకా రావడానికి కారణం ఆవిడే. స్త్రీని ప్రేమించే ప్రతి మగాడూ మా కోసం పోరాడాలి! - ఉత్తమ సహాయ నటి ప్యాట్రీషియా ఆర్క్వెట్టె (బాయ్‌హుడ్) నామినేషన్ పొందుతాననీ, అవార్డు కూడా సాధిస్తానని నేనూహించలేదు. ఈ సందర్భంగా నేను స్త్రీలకు సమాన హక్కుల గురించి మాట్లాడదల్చుకున్నాను. ఇతర దేశాల్లో పురుషులతో సమానంగా స్త్రీకి అన్ని హక్కులూ ఉండవని మాట్లాడుకుంటాం. కానీ, అమెరికాలో కూడా ఆ పరిస్థితే ఉంది. స్త్రీని ప్రేమించే ప్రతి మగవాడూ, స్త్రీలు, పన్ను కడుతున్న ప్రతి ఒక్కరూ... స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నటులకు ఇస్తున్నంత పారితోషికం నటీమణులకు కూడా ఇవ్వాలి. వయసు పైబడే కొద్దీ నటీమణుల పారితోషికం చాలా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. -
నాలుగోసారి..!
మహేశ్‌బాబు ఎంత వేగంతో స్టార్‌గా ఎదుగుతున్నారో, అంతే వేగంతో నటునిగా ఎదుగుతున్నారు. ఈ జనరేషన్లో ఎక్కువ శాతం అవార్డులు అందుకున్న క్రెడిట్ మహేశ్‌దే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరడజను నందులు మహేశ్ ఇంటికి చేరాయి. ఇప్పుడు నాల్గవసారి ఫిలింఫేర్ అవార్డును అందుకొని నేటి హీరోల్లో తనదైన పంథాను కొనసాగించారు మహేశ్. ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాలకు గాను ఇప్పటికే ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారాయన. ఇప్పుడు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి గాను మళ్లీ ఈ పురస్కారం ఆయన్ను వరించింది. శనివారం రాత్రి చెన్నయ్‌లో జరిగిన వేడుకలో మహేశ్ ఈ అవార్డు అందుకున్నారు. ఇదిలా వుంటే... ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’ షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని పోచంపల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 6 నుంచి 18 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో మహేశ్, తదితరులపై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఈ షెడ్యూల్ అనంతరం వెంటనే.. 18 నుంచి 25 వరకూ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో మహేశ్, శ్రుతీహాసన్పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తారు. ఈ నెలాఖరు నుంచి నార్వేలో మహేశ్, తమన్నాపై రెండు పాటల్ని తీస్తారు. మహేశ్ పుట్టినరోజైన ఆగస్ట్ 9న పాటలను, సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే.