శ్వేత బచ్చన్, అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు యాక్టర్స్ ఉన్నారు. జయ బచ్చన్, అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్. అందరు మంచి ఆర్టిస్ట్‌లే. మీ ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ ఎవరు? అంటే శ్వేతా అంటున్నారు అమితాబ్. శ్వేత అమితాబ్ కుమార్తె. రీసెంట్‌గా ఓ టీవి యాడ్ కోసం తండ్రి అమితాబ్‌తో కలిసి ఫస్ట్ టైమ్ కెమెరాను ఫేస్ చేశారు శ్వేత బచ్చన్. ఆ యాడ్ షూట్ తర్వాత శ్వేత యాక్టింగ్ స్కిల్స్ గురించి అమితాబ్ మాట్లాడుతూ– ‘‘శ్వేతా కెమెరాముందు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ తనే. ఒకవేళ తన ముందు ఈ మాట అన్నా తను ఒప్పుకోకపోవచ్చు. తనలో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉంది. మా ఫ్యామిలీ గెట్‌టుగెదర్ అప్పుడు మా అందర్నీ ఎగ్జాట్‌గా ఇమిటేట్ చేస్తుంది’’ అని పేరొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment