Shweta Bachchan
-
ముద్దు మురిపాలు
తల్లిదండ్రుల కళ్లకు పిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. వారి వయసు ఐదు పదులు నిండినా, ఐదేళ్ల పసిపిల్లల్లాగే అనిపిస్తారు. అందుకే వాళ్ల చిన్నప్పటి ఫొటోలు చూసుకుని మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. బిగ్ బీ కూడా ఈ విషయంలో ఒక తండ్రిగానే కనిపిస్తారు. ఏడు పదులు దాటిన బిగ్ బి అమితాబ్ బచ్చన్... అభిషేక్ బచ్చన్, శ్వేత బచ్చన్ బాల్యస్మృతులను గుర్తుచేసుకుంటూ, వారి చిన్నప్పటి ఫొటోలను ట్విటర్లో పోస్టు చేసి మురిసిపోతున్నారు. ‘‘బాల్యంలో ఉండే అమాయకత్వంలో దైవత్వం కనిపిస్తుంది. చిన్న నాటి ఫొటోలు చూసినప్పుడల్లా పిల్లలు ఎంత స్వచ్ఛమైనవారో గుర్తుకు వస్తుంది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. తనకు అభిషేక్ బచ్చన్ రాసిన ఒక లేఖను కూడా ఇటీవలే ట్విటర్లో పోస్టు చేశారు అమితాబ్. ఎంత సెలబ్రిటీలయినా పిల్లలకు తల్లిదండ్రులే, పిల్లల ఆప్యాయతలకు బానిసలే. పిల్లల మురిపాలకు దాసులే. -
మా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ తనే
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు యాక్టర్స్ ఉన్నారు. జయ బచ్చన్, అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యా రాయ్. అందరు మంచి ఆర్టిస్ట్‌లే. మీ ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ ఎవరు? అంటే శ్వేతా అంటున్నారు అమితాబ్. శ్వేత అమితాబ్ కుమార్తె. రీసెంట్గా ఓ టీవి యాడ్ కోసం తండ్రి అమితాబ్‌తో కలిసి ఫస్ట్ టైమ్ కెమెరాను ఫేస్ చేశారు శ్వేత బచ్చన్. ఆ యాడ్ షూట్ తర్వాత శ్వేత యాక్టింగ్ స్కిల్స్ గురించి అమితాబ్ మాట్లాడుతూ– ‘‘శ్వేతా కెమెరాముందు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మా ఫ్యామిలీలో బెస్ట్ యాక్టర్ తనే. ఒకవేళ తన ముందు ఈ మాట అన్నా తను ఒప్పుకోకపోవచ్చు. తనలో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉంది. మా ఫ్యామిలీ గెట్టుగెదర్ అప్పుడు మా అందర్నీ ఎగ్జాట్‌గా ఇమిటేట్ చేస్తుంది’’ అని పేరొన్నారు. -
అభిషేక్ అరుదైన రాఖీ కానుక
ముంబయి: రక్షాబంధన్‌ను బాలీవుడ్ నటులు తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాఖీ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్‌కు అరుదైన కానుక ఇచ్చారు. తాను సోదరితో కలిసి ఉన్నప్పటి చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి శ్వేతాను సర్ప్రైజ్ చేశారు. ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. చిన్ననాటి ఫోటోను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు శ్వేత తనపై ఫైర్ అవుతుందని చమత్కరించారు. శ్వేతతో తన అనుబంధం ఇలాగే వర్థిల్లుతుందని పేర్కొన్నారు. 43 ఏళ్ల శ్వేతా బచ్చన్ వ్యాపారవేత్త నందాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.