అభిషేక్ అరుదైన రాఖీ కానుక
ముంబయి: రక్షాబంధన్‌ను బాలీవుడ్ నటులు తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాఖీ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్‌కు అరుదైన కానుక ఇచ్చారు. తాను సోదరితో కలిసి ఉన్నప్పటి చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి శ్వేతాను సర్‌ప్రైజ్ చేశారు. ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. చిన్ననాటి ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినందుకు శ్వేత తనపై ఫైర్ అవుతుందని చమత్కరించారు. శ్వేతతో తన అనుబంధం ఇలాగే వర్థిల్లుతుందని పేర్కొన్నారు. 43 ఏళ్ల శ్వేతా బచ్చన్ వ్యాపారవేత్త నందాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.