సినిమాలో రాణి మిస్సయింది.. కానీ | Ranveer Singh Said In Movies He Missed The Queen But In Real Life Got | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 17 2018 4:44 PM | Last Updated on Mon, Dec 17 2018 4:44 PM

Ranveer Singh Said In Movies He Missed The Queen But In Real Life Got - Sakshi

సినిమాలో రాణి మిస్సయ్యింది కానీ నిజ జీవితంలో మాత్ర రాణి తనకే దక్కిందంటున్నారు బాలీవుడ్‌ ‘అల్లావుద్దీన్‌ ఖిల్జీ’ రణ్‌వీర్‌ సింగ్‌. ‘స్టార్‌ ప్లస్‌’ వారు నిర్వహించిన స్టార్‌ స్క్రీన్‌ అవార్టుల కార్యక్రమంలో ‘పద్మావతి’ చిత్రంలో చేసిన ఖిల్జీ పాత్రకు గాను ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డ్‌ అందుకున్నారు రణ్‌వీర్‌ సింగ్‌. పెళ్లైన తరువాత అందుకున్న తొలి అవార్డ్‌ కావడంతో కాస్తంతా ఉద్వేగానికి గురయ్యారు రణ్‌వీర్‌. అంతేకాక ఈ అవార్డ్‌ను తన భార్య దీపికకు అంకితమిచ్చారు రణ్‌వీర్‌ సింగ్‌.

ఈ సందర్భంగా రణ్‌వీర్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాకు రాణి లభించలేదు.. కానీ నిజ జీవితంలో రాణి దొరికింది. బేబీ థాంక్యూ.. ఈ ఆరేళ్లలో నేను ఎన్నో సాధించాను.. ఎందకంటే నువ్వు ఎల్లపుడు నాతోనే ఉన్నావు కాబట్టి. ధన్యవాదాలు’ అంటూ వేదిక మీద భార్యను పొగడ్తలతో ముంచెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement